సోనీ నుంచి చవక ధర క్వాడ్ కోర్ స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By: Super

సోనీ నుంచి చవక ధర క్వాడ్ కోర్ స్మార్ట్‌ఫోన్‌లు!

 

ప్రముఖ చిప్ తయారీ సంస్థ మీడియా టెక్ ‘ఎంటి6589 క్వాడ్‌కోర్ సాక్’ పేరుతో సరికొత్త చిప్‌ను ప్రకటించిన నేపధ్యంలో సోనీ, ఎల్‌జి ఇతర ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు చవక ధర క్వాడ్‌కోర్ స్మార్ట్‌ఫోన్‌లను రూపొందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ అంశాన్నిఇప్పటికే ధృవీకరించిన సోనీ, ఎంటి6589 సాక్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను 2013లో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టెస్టింగ్ నేపధ్యంలో మీడియాటెక్ ఇప్పటికే ఎంటి6589 నమూనా చిప్‌లను సదురు కంపెనీలను పంపినట్లు సమాచారం.

‘ఎంటి6589 క్వాడ్‌కోర్ సాక్’ స్పెసిఫికేషన్ లు:

- 720 పిక్సల్ డిస్ ప్లే రిసల్యూషన్,

- కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్ -28ఎన్ఎమ్,

- ప్రాసెసర్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ - 1 నుంచి 1.5గిగాహెడ్జ్ వరకు,

- ఎల్ డీడీఆర్2 మెమెరీ,

- డబ్ల్యూసీడీఎమ్ఏ - టీడీఎస్ సీడీఎమ్ఏ నెట్ వర్క్,

- 13 మెగా పిక్సల్ కెమెరా,

- 1080 పిక్సల్ హైడెఫినిషన్ రికార్డింగ్,

- గ్రాఫిక్స్ యూనిట్ పవర్ వీఆర్ ఎస్ జీఎక్స్544.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot