మార్కెట్లోకి సోనీ పవర్ బ్యాంక్

Posted By:

దేశీయంగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్యాటరీ బ్యాకప్. మార్కెట్లో లభ్యమవుతున్న అత్యధిక శాతం స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ స్థాయి బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యాలను కలిగి ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో జపాన్ చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ సోనీ సరికొత్త పరిష్కార మార్గంతో ముందుకొచ్చింది. ‘సీపీ-బీ3ఏ యూఎస్బీ పవర్ బ్యాంక్' పేరుతో సరికరొత్త పోర్టబుల్ చార్జర్‌ను సోనీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.1590.

 మార్కెట్లోకి సోనీ పవర్ బ్యాంక్

ఈ పోర్టబుల్ పవర్ సొల్యూషన్ చార్జర్ 3000ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ పోర్టబుల్ చార్జర్ నుంచి యూఎస్బీ కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌‍లను తక్షణమే చార్జ్ చేసుకోవచ్చు. శక్తివంతమైన హైబ్రీడ్ జెల్ టెక్నాలజీని సోనీ పోర్టబుల్ చార్జర్‌లో ఉపయోగించింది. ప్రతీ చార్జ్‌లోనూ 90శాతం వరకు శక్తిని యూజర్ ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే అన్ని స్మార్ట్‌ఫోన్‌లను ఈ పోర్టబుల్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. ప్రముఖ రిటైలర్లు అలానే సోనీ సెంటర్ల వద్ద ఈ యూఎస్బీ పవర్ చార్జర్‌ లభ్యమవుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot