సోనీ నుంచి కత్తిలాంటి స్మార్ట్‌ఫోన్!

Posted By: Prashanth

సోనీ నుంచి కత్తిలాంటి స్మార్ట్‌ఫోన్!

 

సోనీ ‘ఎక్స్‌పీరియా ఆడ్వాన్స్’ సరికొత్త వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ వంటి ప్రధాన ఫీచర్లు ఈ ఫోన్ దృఢత్వాన్ని రెట్టింపు చేస్తాయి. మన్నిక సూచికగా ఇచ్చే ‘ఇంగ్రెస్ ప్రొటెక్షన్ రేటింగ్’ను ఈ స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకంది. ధర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు పోర్టబులిటీతో పాటు ఉత్తమమైన పనితీరును కనబరుస్తాయి.

ప్రధాన ఫీచర్లు:

డస్ట్ ప్రూఫ్ ఇంకా వాటర్ ప్రూఫ్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, ఎస్టీ-ఎరెక్సన్ నోవాతోర్ యూ8500 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1800 మెగాహెట్జ్), 512ఎంబీ ర్యామ్, 3.5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటో ఫోకస్, ఆప్టికల్ జూమ్, బుల్ట్-ఇన్ ఫ్లాష్), ఆర్‌డీఎస్‌తో కూడిన ఎఫ్ఎమ్ రేడియో, శక్తివంతమైన 1305ఎమ్ఏహెచ్ లితియమ్ బ్యాటరీ, జీఎస్ఎమ్ నెట్‌వర్క్, యాక్సిలరోమీటర్, డిజిటల్ కంపాస్ జీపీఆర్ఎస్, ఎడ్జ్, హెచ్‌ఎస్‌డిపీఏ డేటా లింకింగ్ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, ఎన్ఎఫ్‌సీ, ఇమేజ్ స్టెబిలైజర్, వీడియో స్టెబిలైజర్.

మరో స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా నియో‌ ఎల్ కీలక ఫీచర్లు:

4 అంగళాల టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ స్కార్పియన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్,

32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

5మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),

3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ 2.0,

ఉత్తమ క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot