త్వరలో సోనీ ఎరిక్సన్ మొబైల్స్ కనుమరుగు..!!

Posted By: Staff

త్వరలో సోనీ ఎరిక్సన్ మొబైల్స్ కనుమరుగు..!!

అది 2001వ సంవత్సరం. రెండు గెయింట్స్, ఒకటేమో కమ్యూనికేషన్స్ రంగంలోకి ప్రవేశించగా, మరోకటి డిజిటల్ ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశించింది. ఈ రెండింటిని కలిపితే ప్రపంచంలో కెల్లా గొప్పదైన కంపెనీలలో ఒకటిగా మన అందరం చెప్పుకునే సోనీ ఎరిక్సన్. రెండు కంపెనీలు కూడా ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్స్ ఎన్నో అద్బుతమైన ప్రోడక్ట్స్‌ని అందివ్వడం జరిగింది. ఇక రాబోయే కాలంలో రెండు బ్రాండ్స్‌(సోనీ, ఎరిక్సన్)ని మనం చూడలేం.

అందుకు కారణం సోనీ కంపెనీ ఎరిక్సన్‌ని స్వాదీనం చేసుకునే దిశగా పావులు కదుపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్స్‌ని అందించే టాప్ టెన్ కంపెనీలలో ఒకటైన సోనీ ఎరిక్సన్ $ 1.5 బిలియన్ డాలర్లకు సోనీ కంపెనీ కొనుగోలు చేయనుందని సమాచారం. గత పది సంవత్సరాలుగా చూసుకున్నట్లేతే ఈ రెండింటి భాగస్వామ్యంతో ఎన్నో అత్యుత్తమమైన మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా సోనీ ఎరిక్సన్ మొబైల్స్ డిజిటల్ కెమెరా ఫీచర్‌కి పెట్టింది పేరు. ఈ విభాగంలో సోనీ ఎరిక్సన్ మొబైల్స్‌ని తలదన్నిన మొబైల్ లేదంటే నమ్మండి.

డిజిటల్ ఉత్పత్తుల విషయానికి వస్తే సోనీ కూడా నెంబర్ వన్‌గా కోనసాగుతుంది. వీరిద్దరూ ఒకటిగా ఆవిర్భవించడానికి కారణం వీరి స్ట్రాటజీ, గోల్స్. సోనీ కంపెనీలో ఉన్న ప్రతినిధి సమాచారం మేరకు సోనీ కంపెనీ ఆండ్రాయిడ్ మొబైల్ ఇండస్ట్రీలో తనదైన శైలిలో రాణించడానికి తగు సన్నాహాలు చేస్తుందని సమాచారం. ప్రస్తుతానికి సోనీ ఎరిక్సన్ తక్కువ కొద్ది ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌ని మాత్రమే మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది.

భాగస్వామ్యంతో ఉన్న ఈ వెంచర్ ఒకరు స్వాధీనం చేసుకుంటే గనుక ఖచ్చితమైన రీసెర్చ్ విభాగాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, మంచి డెవలప్ మెంట్ టీమ్‌ని ఏర్పాటు చేసి హై క్వాలిటీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయవచ్చు అనేది సోనీ ప్లాన్. ఇలా చేయడం వల్ల సోనీ ఎరిక్సన్ మొబైల్ మార్కెట్ బిజినెస్ పరంగా బాగా పెరుగుతుందని సోనీ ప్రతినిధు వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot