సోనీ నుంచి విండోస్ పోన్..?

విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే యోచనలో సోనీ నిమగ్నమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతకొన్ని సంవత్సరాలుగా సోనీ, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే రూపొందింస్తూ వస్తోంది. తాజాగా మైక్రోసాఫ్ట్‌తో ఏర్పరుచుకోబోయే భాగస్వామ్యం సోనీ మార్కెట్‌ను మార్చేసే అవకాశముందని నిపుణుల అంచనా. సీనెట్ తెలిపిన వివరాల మేరకు సోనీ, మైక్రోసాఫ్ట్‌ల ఒప్పందం వాస్తవమే అయితే, సోనీ మొట్టమొదటి సారిగా విండోస్ ఫోన్‌ల ప్రపంచంలోకి ప్రవేశించినట్లవుతుంది. మరోవైపు తన మొబైల్ ఫోన్ ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తృతం చేసే క్రమంలో మైక్రోసాఫ్ట్ ఇతర మొబైల్ తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఐ స్కానింగ్ ఫీచర్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5..?
సామ్‌సంగ్ తురువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి ఆసక్తికర అంశాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల కొరియాలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సామ్‌సంగ్ తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించినట్లు అంతర్జాతీయ న్యూస్ వెబ్‌సైట్‌లు పేర్కొన్నాయి. 2014, ఫిబ్రవరిలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరిస్తారన్న వార్తలు ఇంటర్నెట్ ప్రపంచంలో బలపడుతున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ విడుదల చేయబోతున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 5, 1440x2560 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్ కలిగి ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు అత్యాధునిక ఐ-స్కానింగ్ లాక్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఐ-స్కానింగ్ లాక్ ఫీచర్‌ను ఇప్పటి వరకు ఏ స్మార్ట్‌ఫోన్‌లోనూ వినియోగించలేదు. యాపిల్, హెచ్‌టీసీ వంటి కంపెనీలు ఫింగర్‌ప్రింట్ స్కానర్ వ్యవస్థను కలిగి ఉన్న ఐఫోన్ 5ఎస్, వన్ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను ఇటీవల మార్కెట్లో విడుదల చేసాయి. నిరాశాజనకమనై గెలాక్సీ ఎస్4 అమ్మకాల నేపధ్యంలో ‘గెలాక్సీ ఎస్5'స్మార్ట్ ఫోన్ ను 2014 ఆరంభంలోనే ప్రకటించే అవకాశముందిన పలు నివేదికులు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications








