నీటిలోనూ తీన్‌మారే!

Posted By: Prashanth

నీటిలోనూ తీన్‌మారే!

 

నీటి వాతవరణాన్ని సైతం సమర్థవంతంగా ఎదుర్కొగల స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌పీరియా డిజైన్ చేసింది. పేరు ‘సోనీ ఎక్స్‌పీరియా ఆర్కో ఎస్’. వినియోగదారులచే ప్రత్యేక గుర్తింపునందుకున్న ఈ హ్యాండ్‌సెట్ పటిష్టమైన నీటి నిరోధక తత్వాన్ని కలిగి ఉంటుంది.

ఇతర ఫీచర్లను పరిశీలిస్తే:

4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

12 మెగా పిక్సల్ కెమెరా,

720 పిక్సల్ హై డెఫినిషన్ ఫ్రంట్ కెమెరా,

వాటర్ రెసిస్టెండ్ స్వభావం,

అమర్చిన ఉత్తమమైన 4.3 అంగుళాల డిస్‌ప్లే హైడెఫినిషన్ క్లారిటీతో కూడిన విజువల్స్‌ను విడుదల చేస్తుంది. స్ర్కీన్ స్ర్కాచ్ రెసిస్టెంట్ స్వభావం కలిగినది కావటంతో డిస్‌ప్లే దెబ్బతినకుండా కాపాడుతుంది. నిక్షిప్తం చేసిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్ 1.5 క్లాక్ ఫ్రీక్వెన్సీని కలిగి వేగవంతమైన ప్రాసెసింగ్‌ను అందిస్తుంది. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌‍విచ్ ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్ అనుభూతులను వినియోగదారుకు చేరువ చేస్తుంది.

ఫోన్‌ మల్టీమీడియా అంశాలను పరిశీలిస్తే హ్యాండ్‌సెట్ వెనుకభాగంలో అమర్చిన 12 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. ముందుబాగంలో అమర్చిన హైడెఫినిషన్ కెమెరా సౌలభ్యతతో క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో కూడిన వీడియో ఛాటింగ్ నిర్వహించుకోవచ్చు. ఐపీ57, ఐపీ55 రేటింగ్‌లతో కూడిన డస్ట్ ఇంకా వాటర్‌ప్రూఫ్ పోరలు హ్యాండ్‌సెట్‌ను సురక్షితంగా ఉంచుతాయి.

పూర్తి స్లిమ్ లక్షణాలతో ఆకర్షణీయంగా డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు మాసాల కిందట జపాన్‌లో లాంచ్ చేశారు. మూడవ త్రైమాసికంలో సోనీ ఎక్స్ పీరియా ఆర్కో ఎస్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot