‘సెల్ఫీ ఫోన్’@ సోనీ ఎక్స్‌పీరియా సీ3

|

సెల్ఫీ ఫొటోల క్రేజ్ ప్రస్తుత కమ్యూనికేషన్ ప్రపంచాన్నే కుదిపేస్తోంది. మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా వేరొకరి సహాయం లేకుండా తమకు తామే స్వయంగా ఫొటో తీసుకోవడాన్ని సెల్ఫీ అంటారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సెల్ఫీ ఫోటోల ట్రెండ్ ఇటీవల కాలంలో విస్తృతంగా వ్యాప్తి చెందింది.

 
‘సెల్ఫీ ఫోన్’@ సోనీ ఎక్స్‌పీరియా సీ3

సెల్ఫీ ఫొటోల సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో జపాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపనీ సోనీ, ‘ఎక్స్‌పీరియా సీ3' పేరుతోసరికొత్త ‘సెల్ఫీ ఫోన్'ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. సెల్ఫీలను అత్యుత్తమ చిత్రీకరించుకునేందుకు గాను ఈ ఫోన్ ముందు భాగంలో 25మిల్లీమీటర్ల లెన్స్‌తో కూడిన 5 మెగా పిక్సల్ కెమెరాను అమర్చారు. సాఫ్ట్ ఎల్ఈడి ఫ్లాష్, సుపీరియర్ ఆటో మోడ్ ఫీచర్లను ఈ కెమెరా వ్యవస్థలో ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. వచ్చే ఆగష్టులో ఈ ఫోన్‌ను చైనాలో విడుదల చేసేందుకు సోనీ సన్నాహాలు చేస్తోంది.

సోనీ ఎక్స్‌పీరియా 3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

సోనీ మొబైల్ బ్రావియా ఇంజన్2 టెక్నాలజీతో కూడిన 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్), స్నాప్‌డ్రాగన్ 400 చిప్‌సెట్‌తో కూడిన క్వాడ్‌కోర్ 1.2గగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 8జీబి ఇంటర్నల్ మెమరీ, 4జీ ఎల్టీఈ క్యాట్ 4 కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్ కాలింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (సెల్ఫీ ఫొటోలను చిత్రీకరించుకునేందుకు).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X