సోనీ ఫోన్ ‘ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’ కొనుగోలు పై హెడ్‌ఫోన్స్ ఉచితం!

Posted By:

సోనీ ఫోన్ ‘ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’ కొనుగోలు పై హెడ్‌ఫోన్స్ ఉచితం!
గత వారం సోనీ ఇండియా, ఎక్స్‌పీరియా ఇ, ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్ మోడళ్లలో రెండు సరికొత్త ఎంట్రీలెవల్ స్మార్ట్‌‍ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్‌లను ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌‍లు ప్రీఆర్డర్ పై ఆఫర్ చేస్తున్నాయి. ఆన్ లైన్ మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్‌లకు సంబంధించి ధరలను పరిశీలించినట్లయితే ఎక్స్‌పీరియా ఇ - రూ.9,999, ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్ - 10,999.


ఎక్స్‌‌పీరియా ఇ డ్యూయల్ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేద్దామనుకునే వారికోసం ప్రముఖ రిటైలర్ సాహోలిక్ డాట్‌కామ్ ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్ కొనుగోలు పై అత్యుత్తమ ఆడియో క్వాలిటీని విడుదల చేసే సోనీ హెడ్ ఫోన్ (MDR-ZX100A)లను సాహోలిక్ డాట్‌కామ్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. లింక్ అడ్రస్:

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్ స్పెసిఫికేషన్‌లు:

3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్‌గ్రేడబుల్),
1గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎమ్ఎస్ఎమ్7227ఏ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్,
1530ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot