సోనీ నుంచి ఎక్స్‌పీరియా ఇ1, ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్

Posted By:

సోనీ తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఎక్స్‌పీరియా ఇ1, ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్ పేరుతో రూపొందించబడిన ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌లు ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తాయి. సింగిల్ సిమ్ వేరియంట్ ఎక్స్‌పీరియా ఇ1 ధర రూ.9,490. మార్చి 25 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. డ్యుయల్ సిమ్ వేరియంట్ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్ రూ.10,490. మార్చి 10 నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. సింగిల్ ఇంకా డ్యుయల్ సిమ్ వేరియంట్‌లలో రూపుదిద్దుకున్న ఈ డివైస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

సోనీ నుంచి రెండు చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు

ఫోన్ బరువు 120 గ్రాములు,
పరిమాణం 118x62.4x12మిల్లీ మీటర్లు,
4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
233 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,
1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 (ఎమ్ఎస్ఎమ్8210 ప్రాసెసర్),
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా (720 పిక్సల్ రికార్డింగ్)
1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ (9 గంటల టాక్‌టైమ్, 551 గంటల స్టాండ్‌బై టైమ్).
3జీ కనెక్టువిటీ,
బ్లాక్, పర్పిల్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ డివైస్‌లు లభ్యం కానున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot