యూట్యూబ్‌లో ఆ దృశ్యం!

Posted By: Staff

యూట్యూబ్‌లో ఆ దృశ్యం!

 

క్వాలిటీ మార్కుతో తనదైన ఖ్యాతిని సొంతం చేసుకున్న సోనీ, తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి రెండు కొత్త ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించింది. ఎక్స్ పీరియా SX, ఎక్స్‌పీరియా GX మోడళ్లలో రూపుదిద్దుకుంటున్న ఈ ఆండ్రాయిడ్ ఆధారిత డివైజులను తొలిగా

జపాన్‌లో విడుదల చేసే అవకాశముంది. అంతర్జాతీయంగా విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే యూట్యాబ్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియో సోనీ అభిమానులను ఉత్కంఠకులోను చేస్తుంది. ఎక్స్‌పీరియా GX నమూనాలను పోలి ఉన్న ఓ

స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్‌లతో అబ్బురపరుస్తుంది. క్లుప్తంగా ఆ ఫీచర్లు....

13 మెగా పిక్సల్ కెమెరా,

హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

4.6 అంగుళాల డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ కోర్ 1.5గిగా హెడ్జ్ ప్రాసెసర్,

ఇంటర్నల్ ఫ్లాష్ మెమెరీ 16జీబి వరకు.

యూట్యూబ్‌లో ప్రత్యక్షమైన ఈ వీడియో ‘ఎక్స్‌పీరియా GX’ అంతర్జాతీయ వర్షన్‌ది‌గా విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఎక్స్‌పీరియా SX పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎక్స్‌పీరియా GXకు సంబంధించి సోనీ మూడు అత్యత్తమమైన మీడియా అప్లికేషన్‌లను ప్రకటించింది. హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం వాక్‌మెన్, ఆల్బమ్, మూవీ అప్లికేషన్‌లు క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను యూజర్‌కు అందిస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot