సోనీ vs సామ్‌సంగ్ (ఎవరిది పై చేయి..?)

Posted By: Prashanth

సోనీ vs సామ్‌సంగ్ (ఎవరిది పై చేయి..?)

 

జపాన్ టెక్ దిగ్గజం సోనీ నుంచి ఇటీవల విడుదలైన మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ ‘ఎక్ప్‌పీరియా జే’, స్మార్ట్‌ఫోన్ కింగ్ సామ్‌సంగ్‌కు సవాల్ విసురుతోంది. సూపర్ హిట్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్3’కి యువ సోదరుడుగా వస్తున్న ‘గెలాక్సీ ఎస్ 3 మినీ’కి సోనీ ఎక్ప్‌పీరియా జే పోటీగా నిలిచింది. ఇండియన్ మార్కెట్లో ‘ఎక్ప్‌పీరియా జే’ధర రూ.16,490. గెలాక్సీ ఎస్ 3 మినీ విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘ఈబే.ఇన్’(eBay.in) ఎస్3 మినీకి సంబంధించి ప్రీఆర్డర్‌లను ఆహ్వానిస్తోంది. ధర రూ.26,999. ఈ రెండు గ్యాడ్జెట్ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

బరువు ఇంకా చుట్టుకొలత......

ఎక్ప్‌పీరియా జే: చుట్టుకొలత 124.3 x 61.2 x 9.2మిల్లీ మీటర్లు, బరువు 124 గ్రాములు,

గెలాక్సీ ఎస్‌3 మినీ: చుట్టుకొలత 121.55 x 63 x 9.85మిల్లీ మీటర్లు, బరువు 111.5 గ్రాములు,

డిస్‌ప్లే......

ఎక్ప్‌పీరియా జే: 4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్, బ్రావియా మొబైల్ ఇంజన్,

గెలాక్సీ ఎస్‌3 మినీ: 4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 800 x 400పిక్సల్స్,

ప్రాసెసర్.....

ఎక్ప్‌పీరియా జే: సింగిల్ కోర్ 1గిగాహెడ్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,

గెలాక్సీ ఎస్‌3 మినీ: డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం.....

ఎక్ప్‌పీరియా జే: ఆండ్రాయిడ్ 4.0 ఐసీఎస్,

గెలాక్సీ ఎస్‌3 మినీ: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ (ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, ఎక్ప్‌ప్యాండబుల్ ఇంకా కాంట్రిక్టబుల్ నోటిఫికేషన్స్, రీసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, లైవ్ వాల్ పేపర్ ప్రివ్యూ, హైరిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోస్, మెరుగుపరచబడిన ఆండ్రాయిడ్ బీమ్),

కెమెరా......

ఎక్ప్‌పీరియా జే: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

గెలాక్సీ ఎస్‌3 మినీ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్......

ఎక్ప్‌పీరియా జే: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

గెలాక్సీ ఎస్‌3 మినీ: ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ( 8జీబి/16జీబి), 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ......

ఎక్ప్‌పీరియా జే: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

గెలాక్సీ ఎస్‌3 మినీ: వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

బ్యాటరీ......

ఎక్ప్‌పీరియా జే: 1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ (7 గంటల టాక్‌టైమ్, 25రోజుల స్టాండ్‌బై),

గెలాక్సీ ఎస్‌3 మినీ: 1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర......

ఎక్ప్‌పీరియా జే: ధర రూ.16,490,

గెలాక్సీ ఎస్‌3 మినీ: ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘ఈబే.ఇన్’(eBay.in) ఎస్3 మినీకి సంబంధించి ప్రీఆర్డర్‌లను ఆహ్వానిస్తోంది. ధర రూ.26,999,

ప్రత్యేకతలు.....

ఎక్ప్‌పీరియా జే: ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం, వాక్‌మెన్ ఫీచర్,

గెలాక్సీ ఎస్‌3 మినీ: ఎస్‌ బీమ్, ఎస్ వాయిస్, డైరెక్ట్ కాల్, స్మార్ట్‌స్టే,

తీర్పు.......

మ్యూజిక్ అలానే సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్‌ను కోరుకునే వారికి సోనీ ఎక్ప్‌పీరియా జే ఉత్తమ ఎంపిక. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అలాగే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనుభూతులను కోరుకునే వారికి గెలాక్సీ ఎస్3 మినీ బెస్ట్ ఆప్షన్.

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot