సోనీ ఎక్స్‌పీరియా ఎమ్2 డ్యుయల్@రూ.21990
ఎక్స్‌పీరియా ఎమ్2 డ్యుయల్ పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సోనీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.21990. సోనీ ఎక్స్‌పీరియా ఎమ్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రూపకల్పన చేయబడిన ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా ఆవిష్కరించారు. ఏప్రిల్ 25 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఔత్సాహికులు ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను బ్లాక్, వైట్ ఇంకా పర్పిల్ కలర్ వేరియంట్‌లలో సొంతం చేసుకోవచ్చు. డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, ఎల్ఈడి ఫ్లాష్ ఫీచర్‌తో కూడిన 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా వంటి ఆధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను ఈ డివైస్‌లో నిక్షిప్తం చేసారు.

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్2 డ్యుయల్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
4.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 (ఎమ్ఎస్ఎమ్8226 ప్రాసెసర్),
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
0.3 మెగతా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫోన్ మందం 8.64 మిల్లీ మీటర్లు, బరువు 148 గ్రాములు,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications