ప్రీ-ఆర్డర్ పై సోనీ ఎక్స్‌పీరియా ఎమ్2 డ్యుయల్
సోనీ ఎక్స్‌పీరియా అభిమానులకు శుభవార్త. సోనీ నుంచి తాజా విడుదలైన స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా ఎమ్2 డ్యుయల్'కు సంబంధించి ఇండియన్ మార్కెట్లో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ( Flipkart) ఈ డివైస్‌ను రూ.20999కి ఆఫర్ చేస్తోంది.

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్2 డ్యుయల్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 4.8 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 (ఎమ్ఎస్ఎమ్8226 ప్రాసెసర్), అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 0.3 మెగతా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫోన్ మందం 8.64 మిల్లీ మీటర్లు, బరువు 148 గ్రాములు, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications