సోనీ ఎక్స్‌పీరియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్

Posted By: Prashanth

సోనీ ఎక్స్‌పీరియా నుంచి మరో స్మార్ట్‌ఫోన్

 

సోనీ తన ఎక్స్‌పీరియా సిరీస్‌కు మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను జత చేసింది. ఎక్స్‌పీరియో మిరో (Xperia miro)గా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ ఎంట్రీ లెవల్ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)ముందస్తు బుకింగ్‌లను ఆహ్వానిస్తుంది. బ్లాక్ కలర్ వేరియంట్లో డిజైన్ కాబడిన ఈ ఫోన్ ధర రూ.14,499.

కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

800మెగాహెడ్జ్ స్కార్ఫియన్ ప్రాసెసర్,

ఎఫ్ఎమ్ రేడియో,

వై-ఫై,

32జీబి ఎక్సప్యాండబుల్ మెమెరీ,

1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సెప్టంబర్ మూడవ వారం నాటికి ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సోనీ ఎక్స్‌పీరియా టైపో, సోనీ ఎక్స్ పీరియా టైపో డ్యూయల్:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 5 మెగా పిక్సల్ కెమెరా, 800 మెగాహెడ్జ్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్7227 ప్రాసెసర్, 2.9జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్‌డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత, బ్లాక్, వైట్, రెడ్ ఇంకా బ్లూ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యం కానుంది, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్ వేరియంట్ డ్యూయల్ సిమ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot