ప్రకటన అప్పుడు.. రిలీజ్ ఇప్పుడు!

Posted By: Super

ప్రకటన అప్పుడు.. రిలీజ్ ఇప్పుడు!

 

సోనీ ప్రియులను ఉత్కంఠకు లోను చేసిన స్మార్ట్ ఫోన్ ‘ఎక్స్ పీరియా పీ’ ఈ నెల 25 నుంచి ఇండియన్ మార్కెట్ లలో లభ్యం కానుంది. ఈ గ్యాడ్జెట్ న ముందస్తుగా బుక్ చేసుకునే సదుపాయాన్ని Infibeam.com వారు కల్పిస్తున్నారు. ఈ ఆన్ లైన్ రిటైలర్ ద్వారా

‘ఎక్స్ పీరియా p’ని రూ.25,500 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కోసం ఎప్పటినుంచో నిరీక్షిస్తున్న స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు వారి కలలను సాకారం చేసుకునే సమయం మరి కొంత దగ్గరలోనే ఉంది.

ఉత్తమ క్వాలిటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్న ఈ స్మార్టీలో క్వాలిటీ డిస్‌ప్లే నందించే సోనీ వైట్ మ్యాజిక్ టెక్నాలజీని పొందుపరిచారు. డివైజ్‌లో ప్రస్తుతానికున్న ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ వోఎస్‌ను ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌గా వ్ళద్ధి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఎక్స్‌పీరియా పీ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లు:

* ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

* సుసంపన్నమైన 16 మిలియన్ రంగులతో 4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x960 పిక్సల్స్),

* 8మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్, డిజిటల్ జూమ్, ఆటో ఫోకస్, వీడియో రికార్డింగ్),

* వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఆన్‌లైన్ సర్వీస్ సపోర్ట్,

* ఎఫ్ఎమ్ రేడియో,

* ఇంటర్నల్ మెమెరీ 16జీబి,

* ర్యామ్ 1 జీబి,

* 2జీ, 3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

* జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ కనెక్టువిటీ, హెచ్ టిఎమ్ఎల్ బ్రౌజర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot