సోనీ నుంచి బడ్జెట్ ధరకే రెండు కొత్త ఫోన్లు
ప్రముఖ ఎలక్ట్రానిక దిగ్గజం సోనీ రెండ కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మధ్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా ఈ ఫోన్లను సోనీ కంపెనీ విడుదల చేసింది.
ప్రముఖ ఎలక్ట్రానిక దిగ్గజం సోనీ రెండ కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మధ్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా ఈ ఫోన్లను సోనీ కంపెనీ విడుదల చేసింది. సోనీ సీరిస్ లో ఎక్స్‌పీరియా ఆర్1 ప్లస్, ఎక్స్‌పీరియా ఆర్1 పేరిట ఈ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.ఫీచర్లు ధర, విషయానికొస్తే..

సోనీ ఎక్స్‌పీరియా ఆర్1, ఆర్1 ప్లస్ ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ (ఆర్1), 3 జీబీ ర్యామ్ (ఆర్1 ప్లస్), 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 2620 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర
సోనీ ఆర్1 ప్లస్ ధరను రూ.14,990 గానూ, ఆర్1 ధరను రూ.12,990 గానూ కంపెనీ నిర్ణయించింది. బ్లాక్, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్లు లభించనున్నాయి.

నవంబర్ 10 నుంచి వినియోగదారులకు
నవంబర్ 10 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. సోనీ సెంటర్లు సహా అన్ని ప్రధాన మొబైల్ విక్రయ కేంద్రాల్లోనూ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలోనూ లభించనున్నాయి.

రెండు ఫోన్లలోనూ ఇంచుమించు ఒకే ఫీచర్లు
ర్యామ్, అంతర్గత స్టోరేజీ మినహా ఈ రెండు ఫోన్లలోనూ ఇంచుమించు ఒకే ఫీచర్లు ఉన్నాయి. ఆర్1 ప్లస్ 3జీబీ ర్యామ్ 32 జీబీ అంతర్గత స్టోరేజీతో వస్తుండగా.. ఎక్స్‌పీరియా ఆర్1 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీతో లభిస్తోంది.

నౌగట్ ఓఎస్
ప్రస్తుతానికి నౌగట్ ఓఎస్‌తో వస్తున్న ఈ రెండు ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ తప్పకుండా వస్తుందని సోనీ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే తొలిసారి ఈ ఫోన్లను విడుదల చేయడం విశేషం.


Click it and Unblock the Notifications








