భారీ అంచనాలు మధ్య ‘నేడే విడుదల’..!!

Posted By: Staff

భారీ అంచనాలు మధ్య ‘నేడే విడుదల’..!!

 

సోనీ లోగోతో రూపుదిద్దుకున్న తొలి స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా ఎస్’ నేటి నుంచి ఇండియన్ మార్కెట్లలో లభ్యం కానుంది. 2012 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదికగా ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ప్లేస్టేషన్ గుర్తింపు పొందిన ఈ డివైజ్ ధర రూ.30,000. గతంలో ప్లే స్టేషన్ సర్టిఫికెట్‌ పొందిన స్మార్ట్‌ఫోన్ సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ప్లే లో ఉన్న కంటెంట్‌ని ‘సోనీ ఎక్స్‌పీరియా ఎస్’ ద్వారా యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎరిక్సన్ నుండి షేర్లను కొనుగోలు చేసిన తర్వాత సోనీ మొదటి సారి విడుదల చేస్తున్న స్మార్ట్‌ఫోన్ కావడంతో దీనిపై అభిమానులలో అంచనాలు భారీగా ఉన్నాయి.

‘సోనీ ఎక్స్‌పీరియా ఎస్’ ఫీచర్లు (అంచనా) :

4.3 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.5 జిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

12 మెగా పిక్సల్ కెమెరా(Sony Exmor sensor technology),

3జీ కనెక్టువిటీ,

వై-ఫై,

బ్లూటూత్,

ఎన్ఎఫ్‌సీ ( NFC).

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting