ఏప్రిల్ మొదటి వారంలో సోనీ 'సర్ ప్రైజ్'

Posted By: Staff

ఏప్రిల్ మొదటి వారంలో సోనీ 'సర్ ప్రైజ్'

 

సోనీ కంపెనీ లోగోతో మార్కెట్లోకి రానున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ 'సోనీ ఎక్స్ పీరియా ఎస్'. ఏప్రిల్ నెల నుండి ఇండియాలో లభ్యమవనున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలను తెలుసుకుందాం. రూ 30,000తో ఏప్రిల్ మొదటి వారంలో ఇండియాలో ఉన్న అన్ని స్టోర్స్‌లలో లభ్యమవుతుంది. ఎరిక్సన్ నుండి షేర్స్‌ని కొనుగోలు చేసిన తర్వాత సోనీ మొదటి సారి విడుదల చేస్తున్న స్మార్ట్ ఫోన్ కావడంతో దీనిపై అభిమానులలో అంచనాలు భారీగా ఉన్నాయి.

పైన పేర్కోన్న ఖరీదుని సోనీ అధికారకంగా విడుదల చేసింది. ఇటీవల జరిగిన కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో సోనీ 'సోనీ ఎక్స్ పీరియా ఎస్' స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 'సోనీ ఎక్స్ పీరియా ఎస్' ప్లే స్టేషన్ సర్టిపికెట్ పొందిన రెండవ డివైజ్ కావడం విశేషం. గతంలో ప్లే స్టేషన్ సర్టిఫికెట్‌ని పొందిన స్మార్ట్ ఫోన్ సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా ప్లే. ప్లే స్టేషన్ స్టోర్‌లో ఉన్న కంటెంట్‌ని 'సోనీ ఎక్స్ పీరియా ఎస్' ద్వారా యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్ చు.

'సోనీ ఎక్స్ పీరియా ఎస్' స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు:

హార్డ్‌వేర్

డిస్ ప్లే సైజు:     4.3in

డిస్ ప్లే రిజల్యూషన్:     720x1,280

మెగా ఫిక్సల్:     12.1-megapixel

ప్లాష్:     LED

వీడియో రికార్డింగ్ ఫార్మెట్:     MP4

కనెక్టివిటీ:     Bluetooth, Wi-Fi, USB, NFC

జిపిఎస్:    yes

ఇంటర్నల్ మెమరీ:     1024MB

ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ:     GSM 850/900/1800/1900, 3G 850/900/1900/2100

వైర్ లెస్ డేటా:     EDGE, HSPA

సైజు:     128x64x11mm

బరువు:    144g

ఫీచర్స్

ఆపరేటింగ్ సిస్టమ్:     Android 2.3.7

మైక్రోసాప్ట్ ఆఫీసు ఉత్పత్తులు:     Word/Excel/PowerPoint/PDF viewers

ఈమెయిల్ క్లయింట్:     POP3/IMAP/Exchange

ఆడియో:     MP3, AAC, OGG, FLAC, WAV

వీడియో:     3GP, MP4

ఎఫ్‌ఎమ్ రేడియో:     yes

వెబ్ బ్రౌజర్:     Webkit

ఫోన్‌తో లభించేవి:     headphones, data cable, charger

టాక్ టైమ్:     7.5 hours

స్టాండ్ బైటైమ్:     17.5 days

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot