జపాన్ గుట్టు చైనా చేతిలో..?

Posted By: Prashanth

జపాన్ గుట్టు చైనా చేతిలో..?

 

జపాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ ‘సోనీ’తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి తాజాగా ప్రవేశపెట్టబోతున్న స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా ఎస్ఎల్’కు సంబంధించిన వివివరాలను ఓ ప్రముఖ చైనీస్ టెక్ సైట్ బహిర్గతం చేసింది. సోనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘ఎక్స్ పీరియా ఎస్’కు ‘ఎక్స్‌పీరియా ఎస్ఎల్’కు సక్సెసర్‌గా రానుందని మార్కెట్ వర్గాల అంచనా..

ఫీచర్లు (అంచనా):

నివేదిక ద్వారా బహిర్గతమైన సమాచారం మేరకు.. సోనీ ఎక్స్‌పీరియా ఎస్ఎల్‌లో 1.7గిగాహెట్జ్ క్లాక్ వేగాన్నికలిగిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్ అదేవిధంగా ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంను వినియోగించే అవకాశముంది. ఈ వోఎస్‌ను త్వరలోనే ఆండాయిడ్ జెల్లీబీన్‌కు అప్‌డేట్ చేసుకోవచ్చు. 4.3 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, 12 మెగా పిక్సల్ కెమెరా. లీకైన ఎక్స్‌పీరియా ఎస్ఎల్ ఫోటో ఆధారంగా ఫోన్ సిల్వర్, పింక్, పర్పిల్ తదితర కలర్ వేరియంట్‌లలో డిజైన్ కాబడి ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి నియో ఎల్, ఎస్, యూ, పీ, సోలా, గో మోడళ్లలో రూపుదిద్దుకున్న స్మార్ట్‌ఫోన్‌లను సోనీ ఇప్పటికే దేశీయ విపణిలో లాంచ్ చేసింది.

విడుదల ఎప్పుడంటే:

సోనీ ఈ స్మార్ట్‌పోన్‌ను అగష్టు 29న బెర్లిన్ నిర్వహించే జరిగే ‘ప్రీ - ఐఎఫ్ఏ 2012 ’ కార్యక్రమంలో ఆవిష్కరించనుంది!.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot