సోనీ ఎక్స్‌పీరియా సోలా vs హెచ్‌టీసీ వన్ వీ

Posted By: Staff

సోనీ ఎక్స్‌పీరియా సోలా  vs హెచ్‌టీసీ వన్ వీ

స్మార్ట్‌ఫోన్ విభాగంలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల మధ్య మార్కెట్ పోటీ ఏర్పడింది. ఇటీవల విడుదలైన మధ్య ముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా సోలా (Sony Xperia Sola), హెచ్‌టీసీ డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ వన్ వీ’(HTC One V) నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లు ఇంకా స్పెసిఫికేషన్‌లు......

డిస్‌ప్లే ఇంకా పరిమాణం:

ఎక్స్‌పీరియా సోలా(Xperia Sola): బురువు 107 గ్రాములు, చుట్టుకొలత 116 x 59 x 9.9మిల్లీ మీటర్లు, 3.7 అంగుళాల స్ర్కాచ్ రిసిస్టెంట్ టీఎఫ్‌టీ కెపాసిటివ్

టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854x 480పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజన్.

హెచ్‌టీసీ వన్ వీ (HTC One V): బరువు 115 గ్రాములు, చుట్టుకొలత 120.3 x 59.7 x 9.24 మిల్లీమీటర్లు. 3.7 అంగుళాల ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్

(రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్).

ప్రాసెసర్:

ఎక్స్‌పీరియా సోలా: 1గిగాహెర్జ్ ఎస్‌టీ‌ఈ యూ8500 డ్యూయల్ కోర్ ప్రాసెసర్.

హెచ్‌టీసీ వన్ వీ: 1గిగాహెర్జ్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్8255 స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్.

ఆపరేటింగ్ సిస్టం:

ఎక్స్‌పీరియా సోలా: ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటంగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం),

హెచ్‌టీసీ వన్ వీ: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

ఎక్స్‌పీరియా సోలా: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, ఫేస్ ఇంకా స్మైల్ డిటెక్షన్, జియో ట్యాగింగ్), ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది.

హెచ్‌టీసీ వన్ వీ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, ఫేస్ ఇంకా స్మైల్ డిటెక్షన్, జియో ట్యాగింగ్, బీఎస్ఐ సెన్సార్, లోలైట్ ఇమేజింగ్ క్యాపబులిటీ), ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది.

కనెక్టువిటీ:

ఎక్స్‌పీరియా సోలా: వై-ఫై, వై-ఫై హాట్‌స్పాట్, డీఎల్ఎన్ఏ, ఏ జీపీఎస్, బ్లూటూత్, నేటివ్ యూఎస్బీ టితరింగ్, ఎన్ఎఫ్‌సీ, మైక్రోయూఎస్బీ సపోర్ట్ టపీచర్స్.

హెచ్‌టీసీ వన్ వీ: బ్లూటూత్ 4.0 విత్ ఏపీటీఎక్స్, వై-ఫై 802.11 /b/g/n, మైక్రో యూఎస్బీ 2.0 సపోర్ట్,

మెమరీ:

ఎక్స్‌పీరియా సోలా: 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

హెచ్‌టీసీ వన్‌వీ: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

బ్యాటరీ:

ఎక్స్‌పీరియా సోలా: 1320 లయోన్ బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 475 గంటల స్టాండ్‌బై),

హెచ్‌టీసీ వన్‌వీ: 1500ఎమ్ఏహెచ్ లయోన్ బ్యాటరీ .

ధర:

ఎక్స్‌పీరియా సోలా: రూ.17,899,

హెచ్‌టీసీ వన్ వీ: రూ.19,999.

తీర్పు:

ఈ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు ఉత్తమ స్ధాయి స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉన్నాయి. అయితే రెండు హ్యాండ్‌సెట్‌లలో ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది. ఆపరేటింగ్ సిస్టం విషయంలో ఎక్స్‌పీరియా సోలా వెనుకబడి ఉంది. ఆపరేటింగ్ సిస్టం, బ్యాటరీ బ్యాకప్, ఇన్‌బుల్ట్ బ్యాటరీ తదితర మల్టీ మీడియా అంశాలలో హెచ్‌టీసీ వన్‌వీ ముందజలో ఉంది. అంతిమంగా.. వినియోగదారు హెచ్‌టీసీ వన్‌వీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot