సోనీ ఎక్స్‌‌పీరియా ‘యూ’ (రివ్యూ)

Posted By: Prashanth

సోనీ ఎక్స్‌‌పీరియా ‘యూ’ (రివ్యూ)

 

2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా సోనీ ఎక్ప్‌పీరియా సిరీస్ నుంచి ఆవిష్కరించబడిన స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్ప్‌పీరియా యూ’. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ఇండియన్ మార్కెట్లో ధర రూ.14,999. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్‌సెట్‌ను దీపావళి స్పెషల్‌గా సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం ‘ప్రయోగాత్మక సమీక్ష’.

ఫారం ఫ్యాక్టర్:

ఆకర్షణీయంగా కనిపించే ఈ ఫోన్ ముందుభాగాన్ని 90శాతం వరకు డిస్‌ప్లే కవర్ చేస్తుంది. డిస్‌ప్లే క్రింది భాగంలో ఏర్పాటు చేసిన ఇల్యూమినేటెడ్ లైట్ బార్ మ్యూజిక్ అలానే ఫోటోలను వీక్షించే సమయంలో వివిధ కలర్ వేరింయట్‌లతో కూడిన కాంతులను ప్రకాశింపచేస్తుంది. ఫోన్‌స్ర్కీన్ పరిమాణం 3.5 అంగుళాలు, కెపాసిటివ్ మల్టీ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్. 280 పిక్సల్ డెన్సిటీ, మొబైల్ బ్రావియా ఇంజన్‌తో కూడిన హైడెఫినిషన్ రియాల్టీ డిస్‌ప్లే. ఈ హ్యాండ్‌సెట్ ఆకర్షణీయమైన డిస్‌ప్లేను కలిగి ఉన్నప్పటికి వీడియోలు అలాగే ఫోటోలను చిత్రీకరించుకునే సమయంలో స్ర్కీన్ ప్యానల్ అసౌకర్య భావనకు లోను చేస్తుంది. స్ర్కీన్‌గార్డ్ తప్పనిసరి. ఇక చుట్టుకొలత విషయానికొస్తే 112 x 54 x 12మిల్లీ మీటర్లు, బరువు 110 గ్రాములు.

ఇంటర్ ఫేస్ ఇంకా ప్రాసెసర్:

ఎక్ప్‌పీరియా ‘యూ’ మొదటిగా ఆండ్రాయిడ్ 2.3.7 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైంది. తరువాతి క్రమంలో ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్‌ను అందుకుంది. శక్తివంతమైన డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్. 512ఎంబీ ర్యామ్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. 8జీబి ఇంటర్నల్ మెమరీ ఇందులో 2జీబి మెమరీని ఆండ్రాయిడ్ సిస్టం వినియోగించుకోగా మరో 2జీబిని ఇతర అప్లికేషన్‌లకు సరిపోతుంది. 4జీబి మాత్రమే యూజర్‌కు మిగిలి ఉంటుంది. మెమరీని పొడిగించుకునేందుకు మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ వ్యవస్థ లోపించింది. డివైజ్‌లో వినియోగించిన 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తగిన పనితీరును కనబరుస్తుంది. ఈ ఫోన్‌లో స్వైప్ స్టైల్ ఇంటర్ ఫేస్‌ను చేర్చడం జరిగింది.

కనెక్టువిటీ ఇంకా అప్లికేషన్స్:

బ్లూటూత్ 4.0 విత్ ఏపీటీఎక్స్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, డీఎల్ఎన్ఏ, ఇన్-బుల్ట్ జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0 వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో లోడ్ చేయటం జరిగింది. ఆధునిక ఫోన్‌లలో కనిపిస్తున్న నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్ ఎక్ప్‌పీరియా ‘యూ’లో కనిపించదు.

ప్రీలోడెడ్ ఫీచర్లు: గూగుల్ వాయిస్ సెర్చ్, గూగుల్ టాక్ విత్ వీడియో చాట్, గూగుల్ మెయిల్, గూగుల్ క్యాలెండర్, గూగుల్ గ్యాలరీ 3డీ, గూగుల్ మ్యాప్స్ విత్ స్ట్రీట్ వ్యూ ఇంకా లాటిట్యూడ్, పూర్తిస్థాయి ఫేస్‌బుక్ ఇంటిగ్రేషన్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీడియా:

ఫోన్‌లో నిక్షిప్తం చేసిన మీడియా ప్లేయర్ అత్యుత్తమ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభూతులను చేరువచేస్తుంది. ఏర్పాటు చేసిన ఎక్స్‌లౌడ్ ఆడియో ఫిల్టర్ క్లియర్ బాస్ అవుట్ పుట్‌ను ఉత్ఫత్తి చేస్తుంది. అంకితం చేయబడిన వీడియో ప్లేయర్ అప్లికేషన్ 720 పిక్సల్ సామర్ధ్యం గల వీడియోలను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎఫ్ఎమ్ రేడియో అప్లికేషన్‌ను మరో ప్రత్యేకత.

కెమెరా:

ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 5మెగా పిక్సల్ కెమెరా ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, 16ఎక్స్ డిజిటల్ జూమ్, 720పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 3డీ స్వీప్ పానోరమా, ఫేస్ డిటెక్షన్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన వీజీఏ ఫ్రంట్ కెమెరా ద్వారా వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు. కెమెరా పనితీరు వెళుతురులో అత్యుత్తమంగా ఉంటుంది. తక్కువ వెళుతురులో పనితీరు నిరాశపరుస్తుంది.

బ్యాటరీ:

1320ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని ఫోన్‌లో నిక్షిప్తం చేశారు. ( టాక్‌టైమ్ సామర్ధ్యం 6 గంటల 36 నిమిషాలు, స్టాండ్‌బై టైమ్ 472 గంటలు).

తీర్పు:

ఇతర మధ్య ముగింపు ఫోన్‌లతో పోలిస్తే ఎక్ప్‌పీరియా యూ లోని స్పెసిఫికేషన్‌లు మరింత ఆకట్టుకుంటాయి. డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తనదైన పనితీరును అందిస్తుంది. లిమిటెడ్ స్టోరేజ్ ఆప్షన్ కొంత మేర నిరుత్సాహ పరుస్తుంది.

అనుకూలమైన అంశాలు:

డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆడోబ్ ఫ్లాష్ 11 సపోర్ట్,

రియాల్టీ డిస్‌ప్లే,

ఇల్యూమినేషన్ బార్ గ్లోయింగ్,

సులభమైన అనుకూలీకరణతో దిగువన మార్చుకోగలిగిన ముగింపు టోపి.

ప్రతికూల అంశాలు:

లిమిటెడ్ స్టోరేజ్,

తక్కువ క్వాలిటీతో కూడిన వీడయో ప్లేయర్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot