సోనీ Xperia X పై రూ.24,000 తగ్గింపు
లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.48,990గా ఉండగా, ప్రస్తుత ధర మాత్రం రూ.24,990.
గతేడాది సెప్టంబర్‌లో రూ.10,000 తగ్గింపును అందుకున్న సోనీ Xperia X స్మార్ట్‌ఫోన్ తాజాగా రూ.14,000 తగ్గింపును అందుకుంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.48,990గా ఉండగా, ప్రస్తుత ధర మాత్రం రూ.24,990. Flipkartలో మాత్రమే ఈ రూ.24,000 ధర తగ్గింపు లభిస్తుంది.
Read More : అంతరాయంలోని పనితీరు ఈ ఫోన్ సొంతం

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు అదనంగా 5% తగ్గింపును సోనీ ఆఫర్ చేస్తోంది. మే, 2016లో లాంచ్ అయిన ఈ ఫోన్ గ్రాఫైట్ బ్లాక్, లైమ్ గోల్డ్, రోజ్ గోల్డ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్ లలో అందుబాటులో ఉంది.

Read More : ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌లో చేయకూడని తప్పులు
Sony Xperia X ప్రధాన స్పెసిఫికేషన్స్.. 5 ఇంచ్ Triluminous డిస్‌ప్లే విత్ ఫుల్ హైడెఫినిషన్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.8MHz హెక్సా కోర్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2620 mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4G LTE, Qnovo అడాప్టివ్ ఛార్జింగ్.
Read More : స్మార్ట్‌ఫోన్ లైటింగ్‌తో కళ్లకు ఒత్తిడే


Click it and Unblock the Notifications








