సోనీ నుంచి సరికొత్త మొబైల్, 6 అంగుళాల డిస్‌ప్లేతో..

Written By:

మొబైల్ దిగ్గజం సోనీ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అతి త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. రానున్న ఈ కొత్త ఫోన్ పేరు ఎక్స్‌ఏ2 ఆల్ట్రా అని ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ ఫోన్ బార్సిలోనాలో జరుగబోతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2018లో ఆవిష్కరించనుందనే వార్తలు వస్తున్నాయి. హెచ్‌4233 నెంబర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆన్‌లైన్‌లో స్పాట్‌ అయింది. ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ1 ఆల్ట్రాకు సక్ససర్‌గా ఈ డివైజ్‌ను సోని మార్కెట్‌లోకి విడుదల చేయబోతుంది.

Mi MIX 2పై భారీ డిస్కౌంట్, ఆఫర్ రెండు రోజులే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూమర్ల ప్రకారం..

ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న రూమర్ల ప్రకారం సోని ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ2 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు కుడి, ఎడమ రెండు వైపుల పలుచైన బెజెల్స్‌ కలిగి ఉండనున్నాయి.

ఫీచర్లు ( అంచనా)

1920 x 1080 పిక్సెల్స్‌ రెజుల్యూషన్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
రెండు ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరాలు

కొన్ని నెలల కిత్రమే

కాగా కొన్ని నెలల కిత్రమే సోని తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌1ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఈ డివైజ్‌ మెటల్‌ యూనిబాడీ డిజైన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. దీని ధరను రూ.44,990 గా సోనీ ప్రకటించింది. నీలం, నలుపు, సిల్వర్‌, గులాబీ రంగు ఆప్షన్స్‌లో సోనీ అధికార రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

3డీ క్రియేటర్‌తో ..

3డీ క్రియేటర్‌తో లాంచ్ అయిన తొలిమొబైల్‌ కూడా ఇదే. ఈ సదుపాయం ద్వారా 3డీ స్కాన్లను నేరుగా సృష్టించవచ్చు, 3డీ ప్రింటర్లతో నేరుగా వీటిని ప్రింట్ చేయవచ్చు. దీంతో పాటు ఇండస్ట్రీలో 19 ఎంపీ తొలి మోషన్‌ ఐ కెమెరా (విత్‌ హైబ్రీడ్‌ ఎఎఫ్‌)తో ఈ ఫోన్ వచ్చింది. ఐపి 68 సర్టిఫికేషన్‌తో వాటర్‌, అండ్‌ డస్ట్‌ రెసిస్టెంట్‌ ఫీచర్లు.

ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌1 ఫీచర్లు

5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 పొట్రెక్షన్‌
19 ఎంపీ మోషన్‌ కెమెరా
13ఎంపీ సెల్ఫీ కెమెరా
4జీబీ ర్యామ్‌
64జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్‌
256దాకా విస్తరించుకునే సదుపాయం
2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sony Xperia XA2 Ultra shows up online with dual selfie cameras More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot