సోనీ నుంచి ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్లు..
టెక్ దిగ్గజం సోనీ నుంతి త్వరలో మూడు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి దూసుకురానున్నాయి.
టెక్ దిగ్గజం సోనీ నుంతి త్వరలో మూడు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి దూసుకురానున్నాయి. లాస్ వెగాస్‌లో జరుగుతున్నConsumer Electronics Show 2018లో వీటిని సోనీ కంపెనీ పరిచయం చేసింది.జనవరి 9నుంచి 12వ తేదీవరకు జరగనున్నఈ ఎక్స్‌పోలో సోనీ ఈ మూడు ఫోన్లను పరిచయం చేసింది. కాగా గత ఏడాది లాంచ్ చేసిన ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ1, ఎక్స్‌ఏ1 అ ల్ట్రా కొనసాగింపుగా ఎక్స్‌ఏ2, ఎక్స్‌ఏ2 అ ల్ట్రా, ఎక్స్‌పీరియా ఎల్ 2 పేర్లతో ఈ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఫీచర్లను ఓ సారి పరిశీలించినట్లయితే..

ఎక్స్‌ఏ2 ఫీచర్లు
5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
23 ఎంపీ ప్రైమరీ కెమెరా
8ఎంపీ కెమెరా సెల్ఫీ లెన్స్
విస్తరించుకునే సదుపాయం
3,300ఎంఏహెచ్ బ్యాటరీ

ఎక్స్‌ఏ2 అ ల్ట్రా ఫీచర్లు
6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
విస్తరించుకునే సదుపాయం
23 ఎంపీ ప్రైమరీ కెమెరా
8+6 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా లెన్స్
3,580 ఎంఏహెచ్ బ్యాటరీ

ఎక్స్‌పీరియా ఎల్ 2 ఫీచర్లు ( అంచనా )
5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ నౌగట్ 7.1
క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్
3 జీబి ర్యామ్
32 జీబీ స్టోరేజ్
ఎక్స్‌పాండబుల్ మెమరీ
8ఎంపీ సెల్ఫీ కెమెరా
13ఎంపీ రియర్ కెమెరా
3,300 ఎంఏహెచ్ బ్యాటరీ

ధరలను..
వచ్చే నెల నుంచి మూడు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా వీటి ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కొత్తగా రానున్న ఈ ఫోన్లలో బ్యాటరీ సామర్ధ్యం పెంచినట్లు తెలుస్తోంది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను వెనుకకు మార్చినట్లు సమాచారం. ఇవే ఈ ఫోన్లలో కొత్త ఫీచర్లుగా ఉండనున్నాయని అంచనా...


Click it and Unblock the Notifications








