3డి కెమెరాతో వచ్చిన Sony Xperia XZ1, ఫస్ట్ ఫోన్ ఇదే..

జపాన్ దిగ్గజం సోనీ మరో కొత్త ఫ్లాగ్‌‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌‌ Sony Xperia XZ1ను ఇండియాలో లాంచ్‌ చేసింది.

By Hazarath
|

జపాన్ దిగ్గజం సోనీ మరో కొత్త ఫ్లాగ్‌‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌‌ Sony Xperia XZ1ను ఇండియాలో లాంచ్‌ చేసింది. ఈ ఏడాది సోనీ లాంచ్ చేసిన ఫ్లాగ్‌‌షిప్‌ ఫోన్లలో ఈ ఫోన్ మూడోది. ఇదివరకే సోనీ కంపెనీ Xperia XZ, Xperia XZ1 పేర్లతో కొత్త ఫోన్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మోడళ్లలోని కెమెరాను మార్పులు చేసి ఈ సరికొత్త ఫ్లాగ్‌‌షిప్‌ మొబైల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఫీచర్లపై ఓ లుక్కేయండి.

అక్టోబర్ 14 నుంచి నోకియా 8 అమ్మకాలు, ధర రూ. 36,999, ఆఫర్లు ఇవే..అక్టోబర్ 14 నుంచి నోకియా 8 అమ్మకాలు, ధర రూ. 36,999, ఆఫర్లు ఇవే..

3డి కెమెరాతో వచ్చిన మొట్టమొదటి మొబైల్‌

3డి కెమెరాతో వచ్చిన మొట్టమొదటి మొబైల్‌

సోనీ లాంచ్ చేసిన Sony Xperia XZ1 3డి కెమెరాతో వచ్చిన మొట్టమొదటి మొబైల్‌గా నిలిచింది.

3డీ స్కాన్లను నేరుగా

3డీ స్కాన్లను నేరుగా

ఈ ఫోన్‌తో వినియోగదారులు 3డీ స్కాన్లను నేరుగా సృష్టించవచ్చు, 3డీ ప్రింటర్లతో నేరుగా వీటిని ప్రింట్ చేయవచ్చు.

19 ఎంపీ తొలి మోషన్‌ ఐ కెమెరా

19 ఎంపీ తొలి మోషన్‌ ఐ కెమెరా

ఇండస్ట్రీలో 19 ఎంపీ తొలి మోషన్‌ ఐ కెమెరా (విత్‌ హైబ్రీడ్‌ ఎఎఫ్‌)తో దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

వాటర్‌, అండ్‌ డస్ట్‌ రెసిస్టెంట్‌ ఫీచర్లు

వాటర్‌, అండ్‌ డస్ట్‌ రెసిస్టెంట్‌ ఫీచర్లు

ఐపి 68 సర్టిఫికేషన్‌తో వాటర్‌, అండ్‌ డస్ట్‌ రెసిస్టెంట్‌ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. నీలం, నలుపు, సిల్వర్‌, గులాబీ రంగు ఆప్షన్స్‌లో సోనీ అధికార రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌1 ఫీచర్లు

ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌1 ఫీచర్లు

5.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 పొట్రెక్షన్‌
19 ఎంపీ మోషన్‌ కెమెరా
13ఎంపీ సెల్ఫీ కెమెరా
4జీబీ ర్యామ్‌
64జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్‌
256దాకా విస్తరించుకునే సదుపాయం
2700 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధర

ధర

Sony Xperia XZ1 ధర రూ.44,990

Best Mobiles in India

English summary
Sony Xperia XZ1 With 19MP Motion Eye Camera Launched at Rs. 44,990 in India Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X