52 మెగాపిక్సల్ కెమెరాతో మతిపొగొడుతున్న సోనీ కొత్త ఫోన్
ప్రతిష్టాత్మక మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్లో సోనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేద్దామనుకున్న Sony Xperia హ్యాండ్‌సెట్ ఫోటోలు లీకేజీ భారీన పడ్డాయి.
ప్రతిష్టాత్మక మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్లో సోనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేద్దామనుకున్న Sony Xperia హ్యాండ్‌సెట్ ఫోటోలు లీకేజీ భారీన పడ్డాయి. త్వరలో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటలను చూసిన పబ్లిక్ చేసిన కొన్ని ఫోటోలు Xperia XZ4 టెక్ వర్గాలు చెబుతున్నాయి.అయితే ఇప్పుడు ఈ ఫోన్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది.ఈ ఫోన్ 52 మెగా పిక్సెల్ కెమెరాతో మార్కెట్లోకి రానుంది అని తెలుస్తుంది.ఇప్పటి వరికైతే మార్కెట్లో Honor View 20 ,Redmi Note 7 ఫోన్లు 48 మెగాపిక్సల్ కెమెరాతో మార్కెట్లో ట్రెండ్ సృష్టించాయి ఇప్పుడు సోనీ తన Xperia XZ4 ఫోన్‌ను తీసుకువస్తే ఆ ఫోనే కెమెరా విషయంలో మరో ట్రెండ్ సృష్టించబోతోంది.

6జిబి ర్యామ్
లీకైన రిపోర్ట్ ప్రకారం రానున్న Xperia XZ4 6జిబి ర్యామ్ తో 128 జిబి ఇంటర్నల్ మెమెరీతో రానుంది .ఇంకా డిస్‌ప్లే విషయానికొస్తే 6.5 OLED డిస్‌ప్లే ఉండనుంది. ఆండ్రాయిడ్ 9 పై మీద ఈ ఫోన్ రన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.

52 మెగాపిక్సల్ కెమెరా
కెమెరా విషయానికొస్తే ఇందులో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాలను అమర్చినట్లు సమాచారం. మెయిన్ ది 52 మెగాపిక్సల్ టెలిఫోటో లెన్స్ మరొకటి 16 మెగాపిక్సల్ కెమెరా ఇంకొకటి 0.3 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న 3డీ కెమెరా .

48 మెగాపిక్సల్ కెమెరా ఫోన్ల ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి
Honor View 20 ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 2310 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Redmi Note 7 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.


Click it and Unblock the Notifications