ఈ ఫోన్ ధర ఏకంగా రూ.10 వేలు తగ్గింది

|

దేశీయ మొబైలై మార్కెట్లో దూసుకుపోతున్న సోనీ మొబైల్స్‌ తన మూడు స్మార్ట్‌ఫోన్లపై శాశ్వతంగా ధరను తగ్గించింది. ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌, ఎక్స్‌పీరియా ఎల్‌2, ఎక్స్‌పీరియా ఆర్‌1 స్మార్ట్‌ఫోన్లపై జూలై 6 నుంచి ధరలు తగ్గించినట్టు సోనీ ప్రకటించింది. ఈ తగ్గిన ధరలు సోనీ అన్ని సెంటర్లలోనూ, అమెజాన్‌.ఇన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ఎలక్ట్రానిక్స్‌ స్టోర్లలో అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ చెప్పింది. కాగా కంపెనీ గతేడాది ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌, ఎక్స్‌పీరియా ఆర్‌1 స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయగా ఈ ఏడాది ఎక్స్‌పీరియా ఎల్‌2ను లాంచ్ చేసింది. తగ్గిన ఫోన్ల ధరలు ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

 

బాలీవుడ్‌ని షేక్ చేస్తున్న డ్యాన్సింగ్ అంకుల్,ఈ సారి హృతిక్ స్టెప్పులుబాలీవుడ్‌ని షేక్ చేస్తున్న డ్యాన్సింగ్ అంకుల్,ఈ సారి హృతిక్ స్టెప్పులు

ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌

ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌

ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.29,990 కు అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 39,990 రూపాయలు. అంటే 10 వేల రూపాయల మేర ధర తగ్గింది. ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌ గతేడాది ఇండియా మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన తర్వాత ఇదే అత్యంత ఖరీదైన ధర తగ్గింపు.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్‌ఎస్ ఫీచర్లు

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్‌ఎస్ ఫీచర్లు

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్
ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్
19 మెగాపిక్సల్ రియర్ కెమెరా
13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2
ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
2900 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆడాప్టివ్ చార్జింగ్ టెక్నాలజీ

ఎక్స్‌పీరియా ఎల్‌2 స్మార్ట్‌ఫోన్‌
 

ఎక్స్‌పీరియా ఎల్‌2 స్మార్ట్‌ఫోన్‌

ఎక్స్‌పీరియా ఎల్‌2 స్మార్ట్‌ఫోన్‌ ధరను కూడా రూ.19,990 నుంచి రూ.14,990కు తగ్గించింది. దీనిపై రూ.5వేల తగ్గింపుకు కంపెనీ అందిస్తోంది. మిండ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ అయిన ఎక్స్‌పీరియా ఎల్‌2, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత మార్కెట్‌లోకి లాంచ్‌ అయింది.

సోనీ ఎక్స్‌పీరియా ఎల్2 ఫీచర్లు...

సోనీ ఎక్స్‌పీరియా ఎల్2 ఫీచర్లు...

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్యునోవో అడాప్టివ్ చార్జింగ్.

ఎక్స్‌పీరియా ఆర్‌1

ఎక్స్‌పీరియా ఆర్‌1

ఎక్స్‌పీరియా ఆర్‌1 స్మార్ట్‌ఫోన్‌ను రూ.9,990 కే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.10,990గా ఉండేది. దీనిపై రూ.1000 తగ్గింపును కంపెనీ ఇస్తోంది. ఎక్స్‌పీరియా ఆర్‌1 స్మార్ట్‌ఫోన్‌ గతేడాది అక్టోబర్‌లోనే స్టోర్లలోకి అందుబాటులోకి వచ్చింది.

ఫీచర్లు

ఫీచర్లు

సోనీ ఎక్స్‌పీరియా ఆర్1, ఆర్1 ప్లస్ ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ (ఆర్1), 3 జీబీ ర్యామ్ (ఆర్1 ప్లస్), 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 2620 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Sony slashes price of Xperia XZs, Xperia L2 and Xperia R1 in India More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X