ముస్తాబవుతున్న సోనీ స్మార్ట్‌ఫోన్!
విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ సోనీ హైమెగాపిక్సల్ ఫోన్‌తో ముస్తాబవుతోంది. ట్యాబ్లెట్ పీసీల తరహాలో 1080పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్ స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతున్న నేపధ్యంలో సామ్‌సంగ్, హెచ్‌టీసీ, ఎల్‌జీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు రాబోయే తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ టెక్నాలజీని పొందుపరించేందకు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. తాజాగా ఈ జాబితాలోకి సోనీ వచ్చి చేరింది. ఎక్ప్‌పీరియా యుగా (ఎక్ప్‌పీరియా జెడ్) పేరుతో తన తొలి 1080 పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌ను సోనీ, జనవరిలో నిర్వహించే ‘సీఈఎస్ 2013’లో ఆవిష్కరించనుంది.
స్పెసిఫికేషన్‌లు (అంచనా):
5 మెగా పిక్సల్ డిస్‌ప్లే (1080 పిక్సల్ రిసల్యూషన్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్-కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్ (క్లాగ్‌వేగం 1.5గిగాహెట్జ్),
2జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్,
ఎల్టీఈ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ),
ధర అంచనా 4,298 CNY (రూ. 37,850).
ఈ వివరాలను ప్రముఖ వెబ్‌సైట్ ఈ-ప్రైస్ వెల్లడించింది. సీఈఎస్ వేదిక పై ఎక్స్‌పీరియా ఎక్స్ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ ఆవిష్కరించే అవవాశముందని సదరు వెబ్‌సైట్ పేర్కొంది.
Comments
Best Mobiles in India


Click it and Unblock the Notifications









