సోనీ ఎక్స్‌పీరియా జెడ్2@రూ.49,900

|
సోనీ ఎక్స్‌పీరియా జెడ్2@రూ.49,900

జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ, ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన అధిక ముగింప స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా జెడ్2 (Xperia Z2)ను గురువారం ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించారు. ధర రూ.49,990. బ్లాక్, వైట్ ఇంకా పర్పిల్ కలర్ వేరియంట్‌లో ఈ డివైస్ లభ్యం కాబోతోంది. ఫోన్ కొనుగోలు పై రూ.5,990 విలువ చేసే స్మార్ట్ బ్యాండ్ అలానే రూ.2,990 విలువ చేసే ప్రొటెక్టివ్ కవర్‌ను కంపెనీ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. దేశవ్యాప్తంగా మే 12 నుంచి సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మార్కెట్లో ఇటీవల విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 అలానే హెచ్‌టీసీ వన్ ఎమ్8 ఫోన్‌లకు ఈ సోనీ డివైస్ ప్రధాన పోటీదారు కానుంది. సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.....

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫోన్ బరువు 163 గ్రాములు, పరిమాణం 146.8 x 73.3 x 8.2మిల్లీ మీటర్లు, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్ రిసల్యూషన్, 424పీపీఐ), ఐపీఎస్ టెక్నాలజీతో కూడిన ఐపీఎస్ ప్యానల్, ఐపీ50 సర్టిఫికేషన్ (డస్ట్ ప్రూఫ్ ఇంకా వాటర్ రెసిస్టెంట్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాగ్ వేగం 2.3గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 20 మెగా పిక్సల్ రేర్ కెమెరా (4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, స్పీడ్, డబ్ల్యూఎల్ఏఎన్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ వీ2.0 (ఎమ్ హెచ్ఎల్3)చ యూఎస్బీ ఆన్ ద గో, 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 సోనీ ఎక్స్‌పీరియా జెడ్2@రూ.49,900

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2@రూ.49,900

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2లో శక్తివంతమైన 20.1 మెగా పిక్సల్ సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. క్రిస్టల్ క్లియల్ క్వాలిటీతో కూడిన ఫోటోలను ఈ కెమెరా నుంచి ఆశించవచ్చు. ఈ కెమెరా సాయంతో 4కే క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

 

 సోనీ ఎక్స్‌పీరియా జెడ్2@రూ.49,900

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2@రూ.49,900

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఫోన్ నీటీలో పడినప్పటికి 30 నిమిషాల పాటు చెక్కుచెదరదు.

 సోనీ ఎక్స్‌పీరియా జెడ్2@రూ.49,900
 

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2@రూ.49,900

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాగ్ వేగం 2.3గిగాహెట్జ్),
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ఫీచర్లు ఫోన్ పనితీరును బ్రౌజింగ్ ఇంకా గ్రాఫిక్ విభాగాల్లో మరింత బలోపేతం చేస్తాయి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2@రూ.49,900

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2@రూ.49,900

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 అనేకమైన ప్రీలోడెడ్ యాప్ లను కలిగి ఉంటుంది. వీటి సాయంతో అత్యుత్తమ ఫోటోగ్రఫీని యూజర్ ఆశించవచ్చు.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2@రూ.49,900

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2@రూ.49,900

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2 కొనుగోలు పై రూ.5,990 విలువ చేసే స్మార్ట్ బ్యాండ్ అలానే రూ.2,990 విలువ చేసే ప్రొటెక్టివ్ కవర్‌ను కంపెనీ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X