సెప్టంబర్ 19న సోనీ ఎక్స్‌పీరియా జెడ్3
ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ట్రేడ్ షో వేదికగా సోనీ ఆవిష్కరించిన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా జెడ్3'ని సెప్టంబర్ 19న ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నారు. డివైజ్ ధరకు సంబంధించి పూర్తి వివరాలను తెలియాల్సి ఉంది.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు... 5.2 అంగుళాల డిస్‌ప్లే (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్. 4కే వీడియో రికార్డింగ్ సౌలభ్యత), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీతో వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు అలానే సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, యూఎస్బీ కనెక్టువిటీ, మైక్రో యూఎస్బీ సపోర్ట్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యంకానుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications