నీటి అడుగున సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 అన్ బాక్సింగ్

Posted By:

 ఏకంగా నీటి అడుగునే (వీడియో)

జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ ఇటీవల ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ట్రేడ్ షోలో ప్రదర్శించిన ఎక్స్‌పీరియా జెడ్3 ఫోన్‌ను బుధవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.51,990. ఐపీ65/68 సర్టిఫికేషన్‌ను కలిగి ఉండటంతో ఈ ఫోన్ నీటిలో మునిగినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది.

నీటి అడుగున చేపట్టిన సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 అన్ బాక్సింగ్ వీడియోను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీముందుకు తీసుకురావటం జరుగుతోంది. ఈ వీడియోను xperiablog.net నుంచి సేకరించటం జరిగింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/uIf9GdCzY_Y?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు... 5.2 అంగుళాల డిస్‌ప్లే (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్. 4కే వీడియో రికార్డింగ్ సౌలభ్యత), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీతో వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు అలానే సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, యూఎస్బీ కనెక్టువిటీ, మైక్రో యూఎస్బీ సపోర్ట్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.51,990.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Sony Xperia Z3 underwater unboxing. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot