Home
Mobile

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3

జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ ఇటీవల ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ట్రేడ్ షోలో ప్రదర్శించిన ఎక్స్‌పీరియా జెడ్3, ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ ఫోన్‌లను బుధవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్‌పీరియా జెడ్3 మోడల్ ధర రూ.51,990. ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ మోడల్ ధర రూ.44,990. గురువారం నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఐపీ65/68 సర్టిఫికేషన్‌ను కలిగి ఉండటంతో దుమ్ము ఇంకా నీటి ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయి. భారత్ టెలికామ్ ఆపరేటర్లు అందిస్తోన్న 4జీ ఎల్టీఈ బ్యాండ్‌లను ఈ ఫోన్‌లు సపోర్ట్ చేస్తాయి. ఈ హ్యాండ్‌సెట్‌లలో నిక్షిప్తం చేసిన పీఎస్4 రిమోట్ ప్లే ఫీచర్ గేమింగ్ ప్రియులను మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు... 5.2 అంగుళాల డిస్‌ప్లే (పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్. 4కే వీడియో రికార్డింగ్ సౌలభ్యత), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ క్వాలిటీతో వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు అలానే సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌‍స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, యూఎస్బీ కనెక్టువిటీ, మైక్రో యూఎస్బీ సపోర్ట్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.51,990.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 కాంపాక్ట్

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు... 4.5 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ ఐపీఎస్ డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 20.8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, ఎంహెచ్ఎల్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బరువు 129 గ్రాములు. ధర రూ.44,990.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 మొదటి లుక్ వీడియో...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/G85l8AjwWqg?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Sony Xperia Z3 and Xperia Z3 Compact Launched in India. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X