సోనీ నుంచి ఫస్ట్ డ్యూయెల్ కెమెరా ఫోన్..
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ మొబైల్ రంగంలో దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది.ఈ నేపథ్యంలో భాగంగా కంపెనీ నుంచి అవెంజర్ పేరుతో ఓ ఫోన్ త్వరలో రానుంది.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సోనీ మొబైల్ రంగంలో దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లు వినియోగదారుల ఆదరణ చూరగొనడంతో మరిన్ని ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా కంపెనీ నుంచి అవెంజర్ పేరుతో ఓ ఫోన్ త్వరలో రానుంది.
ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 630 లేదా 660 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయనున్నారు. మిడ్‌రేంజ్ ఫోన్‌గా దీన్ని విడుదల చేయనున్నారు. ఇందులో సరికొత్త ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించనున్నారు. అయితే కంపెనీ దీని ధర వివరాలను ఇంకా ప్రకటించలేదు.

సోనీ అవెంజర్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 23 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








