కాల్‌డ్రాప్స్ సమస్యకు చెక్, ఇకపై టెలిఫోనీ యాప్ ఉంటే చాలు !

Written By:

ఈ రోజుల్లో చాలామంది ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య కాల్‌డ్రాప్స్. దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. సిగ్నల్స్‌ సరిగ్గా లేకపోవడం, మొబైల్‌ నెట్‌వర్క్‌ పనిచేయకపోవడం లాంటి కారణాలు ప్రధానంగా మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా ట్రాయ్ అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇకపై మీ మొబైల్ నెట్‌వర్క్‌, సిగ్నల్స్‌ సరిగా పనిచేయకున్నా మీరుమీ ఆఫీసులో లేదా ఇంట్లో ఉన్న వై-ఫై బ్రాడ్‌బ్యాండ్‌తో ఈ సమస్యకు చెక్‌ పెట్టేయొచ్చని ట్రాయ్ చెబుతోంది. బ్రాడ్‌బ్యాండ్‌తో మొబైల్‌ ఫోన్లకు, అదేవిధంగా ల్యాండ్‌లైన్లకు కాల్స్‌ చేసుకునేలా ప్రతిపాదనలు రూపొందాయి.

షియోమి ఆ రెండింటి ధరలను పెంచేసింది !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రభుత్వం ఆమోదం..

ఇందులో భాగంగా దేశంలో ఇంటర్నెట్‌ టెలిఫోనీకి అనుమతించేందుకు రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనల ప్రకారం టెలిఫోనీ లైసెన్స్‌ను పొందే టెలికాం ఆపరేటర్లు, ఇతర కంపెనీలు సిమ్‌ అవసరం లేని కొత్త మొబైల్‌ నెంబర్‌ను ఆఫర్‌ చేయనున్నాయి.

ఇంటర్నెట్‌ టెలిఫోనీ యాప్‌..

ఇంటర్నెట్‌ టెలిఫోనీ అనేది ఓ యాప్.. టెలికాం యూజర్లు ఈ ఇంటర్నెట్‌ టెలిఫోనీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ సర్వీసులను యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గత అక్టోబర్‌లోనే టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ ఈ ప్రతిపాదనలను రూపొందించింది.

కొత్త కనెక్టివిటీ ఆప్షన్లను..

కాల్‌ డ్రాప్స్‌ సమస్యతో బాధపడుతున్న వినియోగదారుల కోసం ఈ కొత్త కనెక్టివిటీ ఆప్షన్లను తీసుకొచ్చింది. అంతర్ మంత్రిత్వ టెలికాం కమీషన్ కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ ఆమోదంతో ఇక రిలయన్స్‌జియో, బీఎస్‌ఎన్‌, ఎయిర్‌టెల్‌, ఇతర టెలికాం ఆపరేటర్లు ఇంటర్నెట్‌ టెలిఫోనీ సర్వీసులను ప్రారంభించుకోవచ్చు.

సిగ్నల్స్‌ బలహీనంగా ఉన్నప్పటికీ..

ఈ కొత్త కనెక్టివిటీ ఆప్షన్లతో యూజర్లకు ఎంతో మేలు చేకూరనుందని ట్రాయ్‌ పేర్కొంది. టెలికాం సిగ్నల్స్‌ బలహీనంగా ఉన్నప్పటికీ, వై-ఫై అందుబాటు చాలా బలంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

నంబర్‌..

అయితే ఈ సర్వీసుల కోసం యాక్టివేట్‌ చేసుకునే టెలిఫోనీ ఒక ఆపరేటర్‌ది‌, మొబైల్‌ నెంబర్‌ మరో ఆపరేటర్‌ది అయితే, డౌన్‌లోడ్‌ చేసుకునే ఇంటర్నెట్‌ టెలిఫోనీ యాప్‌ ఆపరేటర్‌ నంబర్‌నే యూజర్లు పొందాల్సి ఉంటుంది. ఇతర ఆపరేటర్ నంబర్ ఇస్తే అది పనిచేయదు. 

ఒకే ఆపరేటర్‌ది అయితే..

డౌన్‌లోడ్‌ యాప్‌, సర్వీసు ప్రొవైడర్‌ ఒకే ఆపరేటర్‌ది అయితే నంబర్‌ మార్చుకోవాల్సినవసరం లేదని ట్రాయ్‌ అధికారులు చెప్పారు. దీని వల్ల పూర్ కవరేజ్ ఏరియా ప్రాంతాల్లో పబ్లిక్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండి టెలికాం కంపెనీ సిగ్నల్స్ దొరకనప్పుడు కాల్ సక్సెస్ రేటు పెరుగుతుందని ట్రాయ్ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Soon, use broadband to call landline, mobile numbers More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot