‘మిక్సిట్’..మరో చాటింగ్ అప్లికేషన్ వచ్చేసింది

Posted By:

దక్షిణాఫ్రికాకు చెందిన అతిపెద్ద మొబైల్ సోషల్ నెట్‌వర్క్ మిక్సిట్ (Mxit) తన మొబైల్ ఇన్స్‌స్టింట్ మెసెంజర్ అప్లికేషన్‌ ‘మిక్సిట్'ను మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. ఈ ఉచిత చాటింగ్ సర్వీసును దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ విడుదల చేసారు.

‘మిక్సిట్’..మరో చాటింగ్ అప్లికేషన్ వచ్చేసింది

ఈ చాటింగ్ యాప్.. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్, బ్లాక్‌బర్రీ, జావా, నోకియా ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ల పై స్పందించే అన్ని రకాల ఫీచర్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుందని మిక్సిట్ నెట్‌వర్క్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్యామ్ రువుస్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 8000 రకాల ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా ట్యాబ్లెట్ పరికరాలను ఈ చాటింగ్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఇంగ్లీష్ ఇంకా హిందీ వర్షన్‌లలో అందుబాటులో ఉంది.

మరో 6 నెలల వ్యవధిలో తెలుగ సహా 10 ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసే విధంగా మిక్సిట్ యాప్‌ను తీర్చిదిద్దుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. తమ ప్లాట్ ఫామ్ పై ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లను ఉపయోగించుకోవచ్చని అంతేకాకుండా 10 కేబీపీఎస్ డేటాతోనే 2048 అక్షరాలను పంపుకోవచ్చని కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించంది. తద్వారా చాటింగ్‌కు వెచ్చించే డేటా ఖర్చు గణణీయంగా తగ్గుతుందని కంపెనీ తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot