సౌత్‌కొరియాకు స్పెషల్‌గా?

సామ్‌సంగ్ నుంచి భారీ అంచనాలతో విడుదలై అమ్మకాల విషయంలో రికార్డులు నెలకొల్పుతున్న స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్3’ని, దక్షిణ కొరియాలో సరికొత్త డిజైనింగ్‌తో విడుదల చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటర్నెషనల్ వర్షన్‌కు భిన్నంగా ఈ వర్షన్ డిజైనింగ్ ఉంది. వ్యక్తమవుతున్న ఈ వార్తలో నిజానిజాలు నిర్థారించాల్సి ఉంది. డిజైన్‌కు సంబంధించిన మార్పులను పై చిత్రంలో చూడొచ్చు. ఇంటర్నేషనల్ వర్షన్ గెలాక్సీ ఎస్3 రౌండ్ కార్నర్ డిజైనింగ్‌ను కలిగి ఉండగా, సౌత్ కొరియా వర్షన్ చతురస్ర ఆకారంతో పెద్దదైన డిస్‌ప్లేను కలిగి ఉంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:
4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 ఫోన్ ధర రూ.43,180.


Click it and Unblock the Notifications