రెండు సంవత్సరాలలో నమ్మలేని సెల్ ఫోన్ సేల్స్..

Posted By: Super

రెండు సంవత్సరాలలో నమ్మలేని సెల్ ఫోన్ సేల్స్..

ఇండియాలో ప్రతి సామాన్యుడి వద్ద కూడా ప్రస్తుతం ఏదో ఒక సెల్ ఫోన్‌ని చూస్తున్నాం. ధనిక, పేద అంటూ తేడా లేకుండా ఎవరికి సంబంధించిన ఖరీదులో వారు సెల్ ఫోన్స్‌ని కొనుగోలు చేయడం జరుగుతుంది. కానీ దక్షణ కొరియాలో 2009వ సంవత్సరంలో స్మార్ట్ ఫోన్స్ వాడే వారి వృద్ది రేటు 1.7శాతం ఉండగా, అదే, 2012కల్లా దక్షణ కొరియాలో స్మార్ట్ ఫోన్స్ వాడే వారి వృద్ది రేటు 40 శాతానికి పెరిగింది.

దక్షణ కొరియా టెలికామ్ రెగ్యులేటరీ సంస్ద కొరియా కమ్యూనికేషన్స్ కమీషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం శుక్రవారానికి కొరియాలో స్మార్ట్ ఫోన్స్ వాడే వారి సంఖ్య 20మిలియన్లకు చేరుకుంది. కొరియా దేశానికి చెందిన మొబైల్ ఆపరేటర్ ఎస్‌కె టెలికామ్ క్రింద 10 మిలియన్ కస్టమర్స్ ఉండగా, కెటి కార్పోరేషన్ క్రింద 6.8 మిలియన్ కస్టమర్స్, ఎల్‌జీ యుప్లస్ కార్పోరేషన్ క్రింద 3.3 మిలియన్ కస్టమర్స్ ఉన్నారని తెలిపింది.

2009వ సంవత్సరంలో గనుక చూస్తే స్మార్ట్ ఫోన్స్ సబ్ స్కైబర్స్ 1.7శాతం ఉండగా, అది 2010నాటికి 14.2శాతానికి రాగా, 2012 నాటికి 40శాతానికి అభివృద్ది చెందడం పట్ల కోరియా టెలికామ్ రెగ్యులేటరీ ఆనందాన్ని వ్యక్తం చేసింది. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్స్, శాంసంగ్ కంపెనీకి చెందిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ స్మార్ట్ ఫోన్స్ దేశం యొక్క స్మార్ట్ ఫోన్స్ పెరుగుదలలో పాత్రని పోషించాయి. ఇక వైర్ లెస్ మార్కెట్ విషయానికి వస్తే దేశంలో 52మిలియన్ యూజర్స్ ఉన్నారని తెలిపారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ II కోరియాలో ఒక్క నెలలో వన్ మిలియన్ అమ్మకాలను నమోదు చేసి మొట్టమొదటి స్దానంలో నిలిచింది. దీని తర్వాత స్దానంలో యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 4 నిలిచింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot