197 టాపప్‌తో 42,000 సెకన్ల టాక్‌టైమ్!

టెలికం కంపెనీ వొడాఫోన్ రాష్ట్రంలోని ప్రీ-పెయిడ్ వినియోగదారుల కోసం రూ.197 విలువ గల ‘బడా బోనస్ కార్డ్’ను ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని లోకల్ నెట్‌వర్క్‌లకు పనిచేసే విధంగా 42,000 సెకన్ల టాక్‌టైంను ఆఫర్ చేస్తోంది. నాలుగు వారాల కాల పరిమితి గల ఈ ప్యాక్ ఇ-టాప్ అప్ ద్వారా అందుబాటులో ఉందని వొడాఫోన్ తెలిపింది.
రూ.18 రీఛార్జ్‌తో, 4000 సెకన్ల ఫ్రీ టాక్‌టైమ్!!
ప్రముఖ టెలికం ఆపరేటర్ యూనినార్, రాష్ట్ర చందాదారలు కోసం ప్రత్యేక నైట్‌కాలింగ్ ప్యాకేజిని ప్రవేశపెట్టింది. రూ.18 రీఛార్జ్‌తో 4000 సెకన్ల టాక్‌టైమ్ పొందే అవకశాన్ని కల్పించింది. ఈ టాక్‌టైమ్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే వినియోగించుకోవల్సి ఉంటుంది. ఈ కాల వ్యవధిలో యూనినార్‌తో సహా ఇతర నెట్‌వర్క్‌లతో మాట్లాడుకోవచ్చు. ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు. రాష్ట్రంలో యూనినార్ 28 లక్షల మంది వినియోగదారులను పొందగలగింది. ఈ నెట్‌వర్క్ సేవలు దాదాపు 750 పట్టణాలతో పాటు 3,000గ్రామాలకు విస్తరించాయి.


Click it and Unblock the Notifications








