ఇంతలోనే మరో హాట్ న్యూస్!

Posted By: Prashanth

ఇంతలోనే మరో హాట్ న్యూస్!

 

గెలాక్సీ ఎస్3 మినీ ఆవిష్కరణతో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను తనవైపుకు తిప్పుకున్న సామ్‌సంగ్ ‘గెలాక్సీ ప్రీమియర్’పేరుతో మరో అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది చివరి నాటికి ఆవిష్కరించనున్నట్లు సమాచారం. గెలాక్సీ ఎస్3 అదేవిధంగా గెలాక్సీ ఎస్3 మినీ స్మార్ట్‌ఫోన్‌లకు మధ్య వర్షన్‌గా ఈ ఫోన్ రూపుదిద్డుకుంటున్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ ప్రీమియర్‌కు సంబంధించి తాజాగా బహిర్గతమైన స్సెసిఫికేషన్‌ల వివరాలు.....

4.65 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

స్ర్కీన్ క్రింది భాగంలో రెండు ఆండ్రాయిడ్ కెపాసిటివ్ బటన్లు ఏర్పాటు,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

శక్తివంతమైన 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

మెమరీని పొడిగించుకునేందుకు మైక్రోఎస్డీ కార్ట్ స్లాట్,

కనెక్టువిటీ ఫీచర్లు (4.4ఎంబీపీఎస్ హెచ్‌ఎస్‌డిపిఏ, 5.76ఎంబీపీఎస్ హెచ్‌ఎస్‌యూపీఏ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), డీఎల్ఎన్ఏ, జీపీఎస్)

ఈ ఏడాది ముగింపు నాటికి గెలాక్సీ ప్రీమియర్ ను జర్మనీలో ఆవిష్కరించే అవకాశముంది. ధర అంచనా రూ.32,912.

గెలాక్సీ ఎస్3 మినీ కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడిఫ్లాష్ సౌలభ్యతతో ), వీజీఏ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, 4 అంగుళాల ఆమోల్డ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot