స్పైస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫోన్!!!

Posted By: Staff

స్పైస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫోన్!!!

 

హాట్ మొబైల్ బ్రాండ్ స్సైస్(Spice) ఇటీవలి కాలంలో అనేక బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. తాజాగా ‘స్పైస్ M-5220’ మోడల్‌లో మరో 24X7 ఎంటర్‌టైన్‌మెంట్ ఫోన్‌ను మార్కెట్లో లాంఛ్ చేసింది. రూ.2600లకే లభ్యమవుతున్న ఈ ఫోన్ పూర్తి స్థాయి వినోదాన్ని వినియోగదారుడికి చేరువ చేస్తుంది.

ఫోన్ పూర్తి స్థాయి ఫీచర్లు:

* 1.96 అంగుళాల కలర్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 176 x 220 పిక్సల్స్),

* ఇంటిగ్రేటెడ్ కెమెరా, ఇంటర్నెల్ మెమెరీ, ఎక్సటర్నల్ మెమెరీ 8జీబి వరకు,

* హై క్వాలిటీ మల్టీ మీడియా ప్లేయర్,

* ఎఫ్ఎమ్ రేడియో,

* బ్లూటూత్ కనెక్టువిటీ, యూఎస్బీ కెనెక్టువిటీ,

* స్టాండ్ బై టైమ్ 303 గంటలు,

* ఫోన్ బరువు 129 గ్రాములు.

ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన సున్నితమైన కీప్యాడ్ వ్యవస్థ సౌకర్యవంతమైన టైపింగ్‌కు దోహదపడుతుంది. పొందుపరిచిన మల్టీ మీడియా ప్లేయర్ వ్యవస్థ క్వాలిటీతో కూడిన ఆడియో, వీడియో అనుభూతులను చేరువ చేస్తుంది. ఏర్పాటు చేసిన పటిష్ట స్టోరేజి వ్యవస్థలో నచ్చిన సినిమాలు, మ్యూజిక్‌తో పాటు కీలకమైన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఇన్‌బుల్ట్ చేసిన వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో వ్యవస్థ పూర్తి స్థాయి మన్నికతో పని చేస్తుంది. డ్యూయల్ టోన్ కలర్‌లో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ మొబైల్ లభ్యమవుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting