స్పైస్ ఆండ్రాయిడ్ వన్ డ్రీమ్ ఫోన్ ప్రత్యేకతలు (వీడియో)

Posted By:

తాజాగా ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో అందిస్తోన్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో స్పైస్ ఒకటి. ఆండ్రాయిడ్ వన్ డ్రీమ్ యూఎన్ఓ ఎమ్ఐ-498 మోడల్‌లో స్పైస్ ఈ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ధర రూ.6,499.

స్పైస్ ఆండ్రాయిడ్ వన్ డ్రీమ్ ఫోన్ ప్రత్యేకతలు (వీడియో)

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా స్పైస్ అందిస్తోన్న ఆండ్రాయిడ్ వన్ డ్రీమ్ యూఎన్ఓ ఎమ్ఐ-498 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లకు సంబంధించి విశ్లేషణాత్మక వివరాలతో కూడిన ఓ వీడియోను పాఠకుల ముందుకు తీసుకురావటం జరిగింది. వీడియోను తిలికించే ముందు ఫోన్ ప్రత్యేకతలను ఓ సారి చూద్దాం...

4.5 అంగుళాల తాకేతెర (డిస్‌ప్లే రిసల్యూషన్ 854×480పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ మీడియాటెక్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ ఎల్ అప్‌డేట్ అందుకునే అవకాశం), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫఏసింగ్ కెమెరా, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ ఫోన్ కొనుగోలుదారులకు ఎయిర్‌టెల్ మొదటి 6 నెలల పాటు 200 ఎంబి డేటాను ఉచితంగా అందిస్తోంది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/w7uelw32C64?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Spice Android One Dream UNO Mi-498 UNBOXING. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot