వావ్!! అనిపిస్తున్న స్పైస్ మొబైల్స్...

Posted By: Staff

వావ్!! అనిపిస్తున్న  స్పైస్ మొబైల్స్...

 

బడ్జెట్ ఫ్రెండ్లీ మల్టీ సిమ్ మొబైల్ బ్రాండ్ ‘స్పైస్’(Spice) ఉపయోగకరమైన  మొబైల్ హ్యాండ్ సెట్‌లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెడుతుంది. ఆధునిక ఫీచర్లతో వస్తున్న ‘స్పైస్ మొబైల్స్’ దేశ ఆర్ధిక వ్యవస్థకు అనుగుణంగా సమజంసమైన ధరలకే లభ్యమవుతున్నాయి. ‘స్పైస్’ తాజాగా తన డ్యూయల్ సిమ్ సిరీస్ నుంచి  ‘వవ్ M5335’(Wow M5335) మోడల్‌లో  డ్యూయల్ సిమ్ హ్యాండ్ సెట్‌ను ప్రవేశపెట్టింది. సగటు వినియోగదారుడి కమ్యూనికేషన్ అవసరాలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ డిమాండ్‌లను  డివైజ్ పూర్తి స్థాయిలో తీరుస్తుంది.

ఫోన్ స్పెసిఫికేషన్స్,  ఫీచర్స్:

*    2 అంగుళాల మన్నికైన డిస్‌ప్లే,

*    8జీబి వరకు ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

*    మల్టీ మీడియా ప్లేయర్,

*    ఎఫ్ఎమ్ రేడియో,

*    వీజీఏ కెమెరా,

*    బ్లూటూత్ 2.0,

*    దీర్ఘ కాలిక బ్యాకప్ నిచ్చే  1800mA బ్యాటరీ,

జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. ఉత్తమైన ఫీచర్లను ఒదిగి కేవలం 98 గ్రాములు బరువుతో రూపుదిద్దుకున్న   ‘స్పైస్ వవ్’ డ్యూయల్ సిమ్ మొబైల్  వినియోగదారుడి వృత్తిపరమైన, వ్యక్తిగత అవసరాలను తీర్చటంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot