స్పైస్ స్పెషల్... ‘మొబైల్‌లో లైవ్ టీవీ’

Posted By: Prashanth

స్పైస్ స్పెషల్... ‘మొబైల్‌లో లైవ్ టీవీ’

 

ఉత్తమ క్వాలిటీ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ స్పైస్, FLO సిరీస్ నుంచి సిరికొత్త టచ్‌స్ర్కీన్ హ్యాండ్‌సెట్‌‌ను రూపొందించింది. పేరు‘టీవీ ఎమ్ 5600’.ఈ ఫోన్ ద్వారా ప్రత్యక్ష టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ఫ్లో టచ్ టెక్నాలజీ ఉన్నత విలువలో కూడిన మల్టీమీడియా అనుభూతులను చేరువ చేస్తుంది. ధర రూ.3,099. ఐవోరీ వైట్, జెట్ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో ఈ టచ్‌స్ర్కీన్ ఫోన్ లభ్యం కానుంది.

ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే....

3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

1.3 మెగా పిక్సల్ కెమెరా,

8జీబి ఫ్లాష్ సపోర్ట్,

ఎఫ్ఎమ్ రేడియో,

బ్యాటరీ బ్యాకప్ 4గంటలు,

ఎస్ ప్లానెట్ అప్లికేషన్ స్టోర్,

ముందుగానే లోడ్ చేయబడిన సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్స్.

దేశంలోని అన్ని స్పైస్ హాట్‌స్పాట్ రిటైల్ స్టోర్లలో ‘ఫ్లో టీవీ ఎమ్ 5600’ హ్యాండ్‌సెట్‌లను విక్రయించనున్నారు.

మరో ఫోన్ స్పైస్ ఎమ్5565 ప్రధాన ఫీచర్లు:

2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్, డ్యూయల్ సిమ్, 0.3 మెగా పిక్సల్ కెమెరా, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, 8జీబి ఎక్సటర్నల్ మెమెరీ, నెట్‌వర్క్ సపోర్ట్ జీఎస్ఎమ్ (2జీ), జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, బ్యాటరీ స్టాండ్ బై 500 గంటలు. సాధారణ కర్వ్ డిజైన్‌లో రూపుదిద్దుకున్న ఈ డ్యూయల్ సిమ్ కమ్యూనికేషన్ డివైజ్ ముందు భాగంలో రెండె కాల్ బటన్‌లు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన టచ్ వ్యవస్థ సౌకర్యవంతంగా స్పందిస్తుంది. డివైజ్‌లో దోహదం చేసిన ఆడియో, వీడియో ప్లేయర్లు క్లారిటీతో కూడిన వినోదాన్ని అందిస్తాయి. బ్లూటూత్ సాయంతో ఫైళ్లను సులువుగా షేర్ చేసుకోవచ్చు. ధర రూ.2,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot