ఇక మీదట ఆరోగ్య చిట్కాలు మొబైల్‌లో..

Posted By: Staff

ఇక మీదట ఆరోగ్య చిట్కాలు మొబైల్‌లో..

ప్రపంచలో ఉన్న మొబైల్ కంపెనీలన్నీ పరుగు పందెంలో ఉన్నట్లుగా పరిగెత్తుతున్నాయి. అన్ని కంపెనీలు కూడా ఒకేవిధమైన బిజినెస్ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. కస్టమర్స్‌ని సంతృప్తిపరచడం కోసం కొత్త మొబైల్స్, కొత్త అప్లికేషన్స్, కొత్త సర్వీసెస్ మీద వారియొక్క దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే స్పైస్ మొబైల్ కంపెనీ తమయొక్క కస్టమర్స్ కోసం ఓ సరిక్రొత్త సర్వీస్‌ని ప్రారంభించింది. స్పైస్ మొబైల్ కంపెనీ ప్రవేశపెట్టినటువంటి ఆ సర్వీస్ పేరు 'మొబైల్ హెల్త్ సర్వీస్'.

ఇండియాలో ఉన్న మారు మూల గ్రామాలకు వైద్య సేవలు సరిగా చేరడం లేదు. అందుకే వారికి వైద్యం గురించి సరైన అవగాహాన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. వైద్యానికి సంబందించి అన్నిసమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించడమే ద్యేయంగా ఈ సర్వీస్‌ని లాంచ్ చేయడం జరిగిందని అన్నారు. ఈ సర్వీస్‌కి స్పైస్ పెట్టిన పేరు జియో హెల్తీ. దీని వల్ల ఎవరైతే స్పైస్ మొబైల్ యూజర్స్ ఉన్నారో వారికి వారి ఆరోగ్యం, మెడికల్ సర్వీసుల టాపిక్స్‌కు సంబంధించిన సూచలను అందించడం జరుగుతుంది.

జియో హెల్తీ సర్వీసెస్ వాయిస్ రెప్సాన్స్‌ సర్వీసులు. కాలర్స్ కోసం మెడికల్ నిపుణులు 24*7 అందుబాటులో ఉండి వారికి సూచనలు అందివ్వడం జరుగుతుంది. రోజులో ఏ సమయంలోనైనా కాలర్స్ మెడికల్‌కి సంబంధించి క్వచ్చన్స్‌ని అడగవచ్చు. ఇలాంటి సదుపాయాలను స్పైస్ కంపెనీ 5 ధపాలలో రూపోందించనుంది. జియో హెల్తీ కోసం త్వరలో ఓ నెంబర్‌ని కేటాయించి అది యూజర్స్ అందిరికి అందించనుంది. ఎవరెవరైతే ఈ జియో హెల్తీ‌ని వాడుతారో వారి వద్ద నుండి కొద్ది మొత్తం లో డబ్బులు ఛార్జ్ చేయడం జరుగుతుంది.

ఇలా ఛార్జ్ చేయడానికి కారణం మొదట్లో కస్టమర్స్ ఐడెంటిటీని గుర్తించడం కోసం ఇలా చేస్తున్నాం. ఒక్కసారి ఐడెంటిటీ గుర్తించిన తర్వాత కాలర్స్ డైరెక్టుగా మెడికల్ నిపుణులను క్వచ్చన్స్ అడగవచ్చు. మెడికల్ నిపుణులకు, కాలర్స్‌కు ఇది ఓ అనుసంధాన కర్తగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో గనుక దీనికి మంచి స్పందన వచ్చినట్లైతే ఇందులో మరిన్ని సూచనలను కూడా ప్రతిపాదించడం జరుగుతుందని తెలియజేసారు. ఇలా చేయడం వల్ల స్సైస్ కంపెనీ ఇండియాలో ఉన్న మారుమూల గ్రామాలకు చేరుతుందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot