దీపావళికి 'స్పైస్' పండుగ కానుక: సోనమ్ కపూర్

Posted By: Super

దీపావళికి 'స్పైస్' పండుగ కానుక: సోనమ్ కపూర్

దీపావళి సందర్బంగా స్పైస్ మొబైల్స్ తమ కస్టమర్స్‌కి బంఫర్ ఆఫర్స్‌తో పాటు కొత్త మొబైల్స్‌ని కూడా విడుదల చేయనుంది. స్పైస్ విడుదల చేయనున్న రెండు మొబైల్స్ 'స్పైస్ సాంబా, స్పైస్ కార్నివాల్' దీపావళికి రెండు అధ్బుతమైన గిప్ట్‌లుగా అభివర్ణిస్తున్నారు. స్పైస్ విడుదల చేస్తున్న ఈ రెండు ఫోన్స్‌ని కూడా మ్యూజిక్ విభాగంలో విడుదల చేస్తుంది. ఈ రెండు మొబైల్స్ ఈ దీపావళి సీజన్‌కి రాక్ చేస్తాయని ఎస్ మొబిలిటీ సంస్ద వెల్లడించింది.

స్పైస్ సాంబా మొబైల్‌కి మరో పేరు స్పైస్ సాంబా ఎమ్ 5560. ఈ మొబైల్‌ని ప్రత్యేకించి దేశంలో ఉన్న మ్యూజిక్ లవర్స్‌ని దృష్టిలో ఉంచుకొని విడుదల చేస్తుంది. మొబైల్ కలర్స్‌ని చూసి కస్టమర్స్ మొబైల్ లవ్‌లో పడే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. అంత అందంగా మొబైల్‌‍ని రూపొందించడం జరిగింది. స్పైస్ సాంబా మొబైల్ 2.2ఇంచ్ QVGA డిస్ ప్లేని కలిగి ఉండి, క్వర్టీ కీప్యాడ్ దీని సొంతం.

స్పైస్ సాంబా, స్పైస్ కార్నివాల్ రెండు మొబైల్స్‌లలో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్‌తో మార్కెట్లో లభించే అన్నిరకాల ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. వీటిల్లో ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. మొబైల్స్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్స్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ఉచితం. మెమరీ విషయానికి వస్తే మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 8జిబి వరకు విస్తరించుకొవచ్చు.

బ్లూటూత్, యుఎస్‌బి ప్రత్యేకం. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 950 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. దీంతో యూజర్స్‌కు 4 గంటల పాటు టాక్ టైమ్‌ని అందించనున్నాయి. ఇక ఇండియన్ మొబైల్ మార్కెట్లో స్పైస్ సాంబా, స్పైస్ కార్నివాల్ మొబైల్ ధర సుమారుగా రూ 3,600 వరకు ఉండవచ్చనని అంచనా.. రెండు మొబైల్స్‌ని కూడా స్పైస్ మొబైల్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్వవహారిస్తున్న సోనమ్ కపూర్ చేతులు మీదగా విడుదల చేయడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot