మిరపకాయ్ రేంజ్‌లో మోత మోతే!!

Posted By: Prashanth

మిరపకాయ్ రేంజ్‌లో మోత మోతే!!

 

దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ స్పైస్, స్టెల్లార్ సిరీస్ నుంచి మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వీటి పేర్లు స్పైస్ స్టెల్లార్, స్టెల్లా హారిజన్, స్లెల్లార్ క్రేజ్. వీటి స్ర్కీన్ పరిమాణాలు 3.5, 4, 5 అంగుళాలుగా ఉంటాయి. యాంటీ వైరస్ తెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను ముందుగానే ఈ హ్యాండ్‌సెట్‌లలో లోడ్ చేసి ఉంచారు. ఈ సౌలభ్యతతో డేటా లాస్, వైరస్ లాంటి ప్రమాదాల నుంకి ఫోన్‌లు సురక్షితంగా బయటపడతాయి. పూర్తి స్థాయి మొబైలింగ్ అనుభూతులతో పాటు నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ ఫోన్‌ల ద్వారా యూజర్ ఆశించవచ్చు.

స్పైస్ స్టెల్లార్:

కొద్ది గంటల క్రితమే ఈ హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లో ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. వోఎస్‌ను ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 1గిగాహెడ్జ్ సామర్ధ్యం గల క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేశారు. 4 అంగుళాల టచ్‌స్ర్కీన్, పొందుపరిచిన 2000 mAh బ్యాటరీ 7 గంటల టాక్ టైమ్, 120 గంటల స్టాండ్ బై నిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేసారు. ముందు భాగంలో ఏర్పాటు చేసిన కెమెరా ద్వారా ప్రత్యక్ష వీడియో చాటింగ్ నిర్వహించుకోవచ్చు.

స్పైస్ స్లెల్లార్ హారిజన్:

జూన్ చివరి నాటికి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. 5 అంగుళాల టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, ధర రూ.11,999

స్టెల్లార్ క్రేజ్:

జూన్ చివరి నాటికి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. 3.5 అంగుళాల టచ్ స్ర్కీన్, ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం. వోఎస్‌ను ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ధర రూ.6,499.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot