స్పైస్‌లో ఆండ్రాయిడ్ డ్యూయల్ సిమ్ ఫోన్ - స్పైస్ Mi 270

Posted By: Super

స్పైస్‌లో ఆండ్రాయిడ్ డ్యూయల్ సిమ్ ఫోన్ - స్పైస్ Mi 270

మొబైల్ టెక్నాలజీ మార్కెటింగ్‌లో ఎత్తులకు పైఎత్తులు వేయడంలో అందవేసిన చేయి స్పైస్ మొబైల్‌ది. ఇది మాత్రమే కాకుండా తన ప్రోడక్ట్సుని కస్టమర్స్‌ మనసులకు దగ్గరగా తీసుకెళ్లడంలో స్పైస్ స్టయిలే వేరు. ఇందులో భాగంగానే స్పైస్ మొట్టమొదటిసారి తన విపణిలోకి ఆండ్రాయిడ్ ఆపరేటింగి సిస్టమ్ డ్యూయల్ సిమ్ ఫోన్‌ Spice Mi 270ని ఇండియాలో విడుదల చేయనుంది. స్పైస్ విడుదల చేసిన ఈ కొత్త మోడల్ చాలా తక్కువ ఖరీదులో మాస్ జనాలను బాగా ఆకట్టుకోగలదని అభిప్రాయపడుతున్నారు. ఈ మొబైల్ కొనడం వల్ల డబ్బుకు తగిన వాల్యు రావడమే కాకుండా చూడడానికి కూడా చాలా రిచ్‌నెస్‌గా యూజర్ ప్రెండ్లిగా ఈ మొబైల్ ఉంటుందంటున్నారు.

స్పైస్ Mi 270 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ప్రోయో 2.2తోటి రన్ అవుతూ వేరే ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పోల్చుకుంటే పవర్ వినియోగం కూడా ఎక్కువగా వస్తుందని అన్నారు. సాధారణంగా ఇండియాలో పవర్ కట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మొబైల్ కనుక తీసుకుంటే పవర్ కట్ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది. ఐతే ఈ మొబైల్‌లో కస్టమర్స్ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ఇందులో స్క్రీన్ సైజు మీరు ఊహించినంతగా మాత్రం ఉండదు. సాధారణంగా ఇప్పుడు వచ్చేటటువంటి ఎక్కువ ఆండ్రాయిడ్ ఫోన్స్ స్క్రీన్ సైజు 3.7 inch ఉండగా దీని స్క్రీన్ సైజు మాత్రం 2.8 inchగా ఉంటుంది.

Spice Mi 270 features are:

600 Mhz ARM processor
Dual SIM /stand by option
2.8 inch TFT screen with a resolution of 240x320
Mono type microphone and speaker
3.5 mm audio output
Support for GSM frequency bands 850/900/1800/1900
Touchscreen enabled device
FM Radio with recording facility
2 megapixel camera with optical zoom feature
Extend able memory up to 16 GB with micro SD card slot

ఇక అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ మాదిరే ఇది కూడా వై-ఫై కనెక్టివిటీ, యుఎస్‌బి, బ్లూటూత్ ఫీచర్స్ కలిగి ఉంది. ఐతే ఈ స్పైస్ Mi 270 ఇన్ప్రారెడ్‌ని మాత్రం సపోర్టు చేయదు. ఈ ఫోన్ జిపిఎస్ కనెక్టివిటీతోపాటు గిగాట్యాగింగ్ ఫీచర్‌ని కలిగి ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే దీని బ్యాటరీ సామర్ద్యం 1000 mAh. దీని ఖరీదు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేవిధంగా ఉంచడం జరిగింది. దీని ధర కేవలం రూ 5700మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot