స్పైస్ కొత్త స్మార్ట్‌ఫోన్.. ‘స్టెల్లార్ క్రేజ్’!

Posted By: Prashanth

స్పైస్ కొత్త స్మార్ట్‌ఫోన్.. ‘స్టెల్లార్ క్రేజ్’!

 

హాట్ బ్రాండ్ స్పైస్ (Spice) శనివారం సరికొత్త డ్యూయల్ సిమ్‌ఫోన్‌ను విడుదల చేసింది. పేరు స్పైస్ స్టెల్లార్ క్రేజ్ ఎమ్ఐ-355. పాపులర్ ఫోన్ స్పైస్ స్టెల్లార్‌కు ఈ మొబైల్ కజిన్. డ్యూయల్ సిమ్ సౌలభ్యతతో రూపుదిద్దకున్న ఈ హ్యాండ్‌సెట్ స్ర్కీన్ సైజ్ 3.5 అంగుళాలు (టచ్ టైప్). శక్తివంతమైన 800మెగాహెడ్జ్ ప్రాసెసర్‌ను వినియోగించారు. 512ఎంబీ ఆన్-బోర్డ్ ర్యామ్. ఫోన్ మెమరీని మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 32జీబికి వృద్ధి చేసుకోవచ్చు.

డివైజ్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ సామర్ధ్యం గల కెమెరాను అమర్చారు. వీడియో కాలింగ్ కోసం వీజీఏ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ప్రస్తుతానికి హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరటేంగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో ఈ వోఎస్‌ను ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ చేసుకోవచ్చు. పొందుపరిచిన వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ వ్యవస్థను డేటాను వేగవంతంగా షేర్ చేస్తాయి. నెట్‌క్విన్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో ముందుగానే అప్‌లోడ్ చేశారు.

గ్యాడ్జెట్‌లో లోడ్‌ చేసిన ఏ-జీపీఎస్, సోషల్ నెట్‌వర్కింగ్, ఐఎమ్, మ్యూజిక్ ప్లేయర్ అప్లికేషన్‌లు కమ్యూనికేషన్ ఇంకా వినోదపు అవసరాలను సమృద్ధిగా తీరుస్తాయి. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ డాట్ కామ్ (Saholic.com)ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,599కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు పై రూ.300 మనీ బ్యాకప్ ఆఫర్‌ను కల్పిస్తుంది.

ఫీచర్లు క్లుప్తంగా:

3.5 అంగుళాల టీఎఫ్‌టి ఎల్‌సీడి స్ర్కీన్ (రిసల్యూషన్480x 320పిక్సల్స్),

800మెగాహెట్జ్ ప్రాసెసర్,

5 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

హెచ్ఎస్‌డీపీఏ (7.2 ఎంబీపీఎస్).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot