చివరిదాకా రచ్చ రచ్చే!!

Posted By: Staff

చివరిదాకా రచ్చ రచ్చే!!

 

మొబైల్ ఫోన్ తయారీ సంస్థ స్పైస్  (Spice) తాజాగా సరికొత్త టచ్‌స్ర్కీన్ మొబైల్ ఎమ్5565ను మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన ప్రతి ఫీచర్ ఔరా అనిపిస్తుంది భారతీయ వినియోగదారులకు ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ధర రూ.2,500.

స్పైస్ ఎమ్5565 ప్రధాన ఫీచర్లు:

2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్,  డ్యూయల్ సిమ్, 0.3 మెగా పిక్సల్ కెమెరా, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, 8జీబి ఎక్సటర్నల్ మెమెరీ, నెట్‌వర్క్ సపోర్ట్ జీఎస్ఎమ్ (2జీ), జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, బ్యాటరీ స్టాండ్ బై 500 గంటలు.

సాధారణ కర్వ్ డిజైన్‌లో రూపుదిద్దుకున్న ఈ డ్యూయల్ సిమ్ కమ్యూనికేషన్ డివైజ్  ముందు భాగంలో రెండె కాల్ బటన్‌లు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన టచ్ వ్యవస్థ సౌకర్యవంతంగా స్పందిస్తుంది. డివైజ్‌లో దోహదం చేసిన ఆడియో, వీడియో ప్లేయర్లు క్లారిటీతో కూడిన వినోదాన్ని అందిస్తాయి. బ్లూటూత్ సాయంతో ఫైళ్లను సులువుగా షేర్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot