స్పైస్ నుండి తక్కువ ధరలో రెండు బడ్జెట్ మొబైల్స్

Posted By: Staff

స్పైస్ నుండి తక్కువ ధరలో రెండు బడ్జెట్ మొబైల్స్

గత ఐదు సంవత్సరాలుగా ఇండియన్ మొబైల్ మార్కెట్ సినారియో మారిపోయింది. మొబైల్ ఇండస్ట్రీలో చాలా కంపెనీలు తమయొక్క పురోగతిని సాధించేందుకు పయనమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో హైఎండ్ లగ్జరీ ఫోన్స్ నుండి సాధారణ బడ్జెట్ ఫోన్స్ కూడా లభ్యమవుతున్నాయి. ఇండియాలో లీడింగ్ మొబైల్ కంపెనీ అయినటువంటి స్పైస్ తన అమ్ముల పోది నుండి రెండు కొత్త బడ్జెట్ ఫోన్స్‌ని ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ రెండు మొబైల్ ఫోన్స్ Spice M 5350 Elite, Spice M5500. ఈ రెండు మొబైల్స్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

స్పైస్ విడుదల చేసినటువంటి M 5350 Elite, M5500 రెండు మొబైల్స్ కూడా డ్యూయల్ సిమ్ ఫోన్స్. స్పైస్ ఎమ్ 5500 టచ్ రెసిస్టివ్ స్క్రీన్ సదుపాయం కలగిన ఫోన్. స్పైస్ ఎమ్ 5350 మాత్రం ఆల్పా న్యూమరిక్ కీ ప్యాడ్ కలిగిన ఫోన్. రెండు మొబైల్స్ కూడా వాయిస్ రికార్డింగ్ ఫెసిలిటి తోపాటు, మొబైల్ ప్రైవసీ ప్రోటక్షన్‌‍ని కలిగి ఉన్నాయి. ఇక స్పైస్ ఎమ్ 5350 ఎలైట్ పోన్‌లో మాత్రం ఎస్ఎమ్ఎస్ షెఢ్యూలింగ్ అనేది అధనపు ఫీచర్.

మల్టీమీడియా విషయానికి వస్తే స్పెస్ ఎమ్5350 ఎలైట్ 0.3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడమే కాకుండా పోను లోనే మ్యూజిక్ ప్లేయర్‌తో అలరిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఎఫ్ ఎమ్ రేడియో, ఎఫ్‌ఎమ్ రికార్డింగ్ సదుపాయం కూడా ఉంది. ఇక స్పైస్ ఎమ్ 5500 మాత్రం 1.3 మెగాఫిక్సల్ కెమెరాతో పాటు ఫ్రీలోడెడ్ మ్యూజిక్ ప్లేయర్‌ని కలిగి ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే స్పైస్ ఎమ్ 5350 ఎలైట్‌ని స్పైస్ ఎమ్5500తో పోల్చినట్లైతే ఎలైట్‌లో బ్లూటూత్ ఆప్షన్ ఎగస్ట్రా. ఎలైట్ మోడల్‌ని ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేసుకోని ఓ మోడమ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు.

స్పైస్ ఎమ్5350 ఎలైట్ మోడల్‌లో ఉన్న యుఎస్‌బి స్లాట్ వల్ల దీనితో డేటా ట్రాన్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఎమ్ 5500లో 110KB ఇంటర్నల్ మొమొరీతో పాటు మొమొరీ కార్డుని వేసేందుకు వీలుగా స్లాట్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రెండు మొబైల్స్‌లలో కూడా బాగా ఆకర్షింజేవి దీని ధర. స్పైస్ ఎమ్ 5350 ఎలైట్ ధర కేవలం రూ 1800 కాగా, అదే స్పైస్ ఎమ్ 5500 ధర మాత్రం 3600గా నిర్ణయించడమైంది. స్పైస్ కంపెనీ విడుదల చేసినటువంటి ఈ రెండు మోడల్స్ కూడా డబ్బుకు దగిన వాల్యూని అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting